Jupiter Transit: రేపు గురువు మేషంలో అడుగు..బుధాదిత్య యోగం.. గురువు అనుగ్రహంతో ఈ రాశివారి కెరీర్‌లో పురోగతి!

|

Apr 21, 2023 | 1:50 PM

ఏప్రిల్ 22లో  మేషరాశిలో బుధుడు, సూర్యుడు కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడబోతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారు మే 14 వరకు భారీ లాభాలను పొందుతారు. గురువు దృష్టి  నేరుగా సింహం, తులారాశి, ధనుస్సు రాశులపై పడుతుంది.

Jupiter Transit: రేపు గురువు మేషంలో అడుగు..బుధాదిత్య యోగం.. గురువు అనుగ్రహంతో ఈ రాశివారి కెరీర్‌లో పురోగతి!
Jupiter Transit
Follow us on

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవజీవితంపై గ్రహాల ప్రభావం పడుతుంది. మంచు చెడులు గ్రహాల సంచారం వలెనే కలుగుతాయని విశ్వాసం. అందుకనే జాతకంలో గ్రహ సంచారం బట్టి భవిష్యత్ ను అంచనా వేస్తారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 22లో  మేషరాశిలో బుధుడు, సూర్యుడు కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడబోతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారు మే 14 వరకు భారీ లాభాలను పొందుతారు. గురువు దృష్టి  నేరుగా సింహం, తులారాశి, ధనుస్సు రాశులపై పడుతుంది. ‘గురు దర్శనం కోటి లాభాలు’ అంటారు. ఆ మాట ప్రకారం దేవతల గురువు తన దృష్టితో ప్రజలకు మేలు చేస్తాడు. అదే సమయంలో ఇతర గ్రహాల ప్రభావంతో కొన్ని రాశులవారికి ప్రతికూల ప్రభావాన్ని కూడా ఇస్తాడు.

మేష రాశి: నవగ్రహాలలో బృహస్పతి శుభప్రదుడు. గురువు ఈ రాశివారు జాతకంలో 9వ , 12వ గృహాలకు అధిపతి. అయితే  బుధాదిత్య యోగం వలన వీరికి అధిక ఖర్చులు ఉంటాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.  అదే సమయంలో పెరుగుతున్న ఖర్చుల గురించి చింతించకండి. ఆస్తులను విక్రయించి కొత్తవి కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. విదేశీ వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి ఉంది.

వృషభరాశి: సంవత్సరానికి ఒకసారి సంచరిస్తూ సకల శుభాలను ఇచ్చే గురువు ఈ రాశికి 8వ, 11వ స్థానాలకు అధిపతి. ఈ రాశివారికి గురువు..  శుక్రుడికి మధ్య శత్రుత్వం ఉంటుంది. అయితే బృహస్పతి అనుగ్రహంతో  రాజయోగం నడుస్తుంది. దీంతో విజయ ఫలాలు పొందుతారు. గురు వ్యయ స్థానంలోకి వస్తే.. అధిక ఖర్చులు చేస్తారు. చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి. వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మిథున రాశి: నవగ్రహాలకు గురువు ఈ రాశివారు జాతకంలో 7వ, 10వ గృహాలకు అధిపతి. వ్యాపార సంస్థకు అధిపతి అయిన గురుడు లాభ స్థానంలో అడుగు పెట్టడం వలన ఆర్థికకంగా గొప్ప అభివృద్ధి ఉంటుంది. సమాజంలో విలువ, గౌరవం పెరుగుతాయి. మౌలిక వసతులు ఏర్పరచుకుంటారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం ద్వారా కోల్పోయిన సంపదను తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లల వల్ల సమస్యలు తొలగుతాయి. ఆడపిల్లల వివాహాలు జరిగే అవకాశం ఉంది. రాజకీయ నేతల జీవితంలో కొత్త మలుపులు వస్తాయి.

కర్కాటక రాశి : ఈ రాశివారికి  6వ, 9వ ఇంటికి అధిపతి గురువు. ఇప్పుడు 10వ స్థానంలో ఉన్నాడు. కనుక పనిచేస్తున్న ప్లేస్ లో టెన్షన్‌ ఉండదు. ప్రతికూల ఆలోచనలను మాని.. సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. విలాసవంతమైన ఖర్చులను చేస్తారు. వ్యాపారులకు ఉద్యోగస్తుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది.

సింహ రాశి : ఈ రాశివారికి గురువు 5 , 8 స్థానాలకు అధిపతి. ఈ రాశివారికి పాజిటివ్ రిజల్ట్స్ రానున్నాయి.  ఉద్యోగస్తులకు అనుకూలం. సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. రుణ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇప్పటి వరకు తలెత్తిన సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు  జీతం పెరుగుతుంది. ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.

కన్య రాశి: నవగ్రహాలలో లాభాలను ఇచ్చే గురువు ఈ రాశివారికి 4, 7 స్థానాలకు అధిపతి. ఇప్పుడు ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. అష్టమంలో గురువు అడుగు పెట్టడం వలన కష్టాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. అదే సమయంలో, ఎక్కువ వ్యర్థమైన ఖర్చులు చేస్తారు. వైద్య ఖర్చులు పెరుగుతాయి.   పొదుపు పాటించడం, ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలో విబేధాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ఉద్యోగ బదిలీ ఒత్తిడిని కలిగిస్తుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)