ఈ ఏడాది వస్తున్న తొలి సూర్య గ్రహణం.. ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపనుందంటే

మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్‌ 8వ తేదీన ఏర్పడనుంది. ఇదిలా ఉంటే ఈ రెండు గ్రహణాలు భారత్‌లో కనిపించకపోవడం గమనార్హం. ఇక గ్రహణాల వల్ల రాశులపై ప్రభావం పడుతుందని పండితులు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా సూర్య గ్రహణ ప్రభావం వ్యక్తుల రాశులపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతుంటారు. ఇంతకీ ఈ ఏడాది...

ఈ ఏడాది వస్తున్న తొలి సూర్య గ్రహణం.. ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపనుందంటే
Zodiac Signs
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 05, 2024 | 6:05 PM

Solar eclipse: ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి. 2024లో తొలి చంద్రగ్రహణం మార్చి 25వ తేదీన వస్తుండగా, మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్‌ 8వ తేదీన ఏర్పడనుంది. ఇదిలా ఉంటే ఈ రెండు గ్రహణాలు భారత్‌లో కనిపించకపోవడం గమనార్హం. ఇక గ్రహణాల వల్ల రాశులపై ప్రభావం పడుతుందని పండితులు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా సూర్య గ్రహణ ప్రభావం వ్యక్తుల రాశులపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతుంటారు. ఇంతకీ ఈ ఏడాది వస్తున్న తొలి సూర్య గ్రహణం కారణంగా ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపనుంది.? జీవితాల్లో ఎలాంటి మార్పులకు దారి తీయనుంది.? ఇప్పుడు తెలుసుకుందాం.

తులా రాశిపై ప్రభావం..

ఈ ఏడాది రానున్న తొలి సూర్య గ్రహణం తులా రాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత, వృత్తి జీవితంలో సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని జోత్యిష్య పండితులు సూచిస్తున్నారు.

కన్య రాశిపై..

ఏప్రిల్‌ 8వ తేదీన రానున్న సూర్య గ్రహణం కన్యా రాశి వారికి అనుకూలత చూపించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కెరీర్‌లో పురోగతి సాధిస్తారని చెబుతున్నారు.

ధనస్సు రాశి వారికి లాభం..

సూర్య గ్రహణ ప్రభావం ధనుస్సు రాశివారిపై కూడా సానుకూలంగా ఉండే అవకాశం ఉందని పండితులు అంచనావేస్తున్నారు. కీర్తి ప్రతిష్టలు దక్కడంతో పాటు, దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని చెబుతున్నారు.

మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి…

ఈ సూర్యగ్రహణం వల్ల మేష రాశి వారి ఆర్థిక స్థితి మెరుగువుతుందని పండితులు చెబుతున్నారు. వైవాహిక జీవితం బాగుంటుందని, ఉద్యోగులకు ప్రమోషన్స్‌ వస్తాయని చెబుతున్నారు.

మిధున రాశి వారికి శుభవార్త..

ఈ ఏడాది వచ్చే తొలి సూర్యగ్రహణం మిధున రాశి వారికి కలిసొస్తుందని పండితులు చెబుతున్నారు. కెరీర్‌కు సంబంధించిన ఒక శుభవార్త వింటారని, ఆదాయం విపరీతంగా పెరుగుతుందని చెబుతున్నారు.

సింహరాశి వారికి గుడ్‌ న్యూస్‌..

సింహరాశి వారికి ఈ సూర్యగ్రహణం అనుకూలంగా ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. మీరు చేసిన పనికి తగ్గ ఫలితం లభిస్తుందని చెబుతున్నారు. మీ సంపద రెట్టింపయ్యే అవకాశం ఉంటుందని, నలుగురిలో గౌరవం పెరుగుతుందని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కొందరు జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని రాశి ఫలాల కోసం క్లిక్ చేయండి..