ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20వ తేదీన ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న ఉదయం 07:04 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:29 గంటలకు ముగుస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం.. సూర్యగ్రహణం అమావాస్య రోజున, చంద్రగ్రహణం పౌర్ణమి రోజున సంభవిస్తుంది. ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. వైశాఖ పూర్ణిమ రోజున ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం. పురాణాల ప్రకారం.. సూర్య , చంద్ర గ్రహణాలు రాహు , కేతువుల వల్ల సంభవిస్తాయని నమ్మకం.
ఏప్రిల్ 20న ఏర్పడే సూర్యగ్రహణం మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుందని అంచనా. అయితే, ఈ నాలుగు రాశులకు చెందిన వ్యక్తుల ఆరోగ్యం, వృత్తి, ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు అని జ్యోతిష్కులు చెబుతున్నారు. సూర్య గ్రహణ ప్రభావం పడే ఈ రోజు ఆ నాలుగు రాశులు ఏమిటో తెలుసుకుందాం..
మేషరాశి : 2023 మొదటి సూర్యగ్రహణం ఈ రాశికి చెందిన వ్యక్తులపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. మేషరాశికి చెందిన వ్యక్తులు వైవాహిక జీవితంలో ఉద్రిక్తతలతో సహా ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉండవచ్చు. కనుక ఈ రాశివారు తమ భాగస్వాములతో ఎలాంటి వాదనలు చేయకుండా వివాదాలు ఏర్పడకుండా దూరంగా ఉండి ఓపికగా ఉండడం మంచిది. ఈ సమయంలో ఆర్థికంగా బలహీనంగా ఉండవచ్చు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడిని కలిగిస్తుంది.
వృషభ రాశి : సూర్యగ్రహణం కారణంగా వృషభ రాశి వారికి దుబారా వల్ల డబ్బుకు లోటు ఏర్పడవచ్చు. దీన్ని నివారించడానికి.. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈ సమయంలో ఈ రాశివారు భావోద్వేగాలు, భాషపై నియంత్రణను కలిగి ఉండటం చాలా కీలకం. ఇది వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలలో పరిణామాలకు దారితీయవచ్చు. ప్రశాంతతను కాపాడుకోవడానికి ఈ రాశివారు వృత్తి, వ్యక్తిగత సంబంధాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు.. కనుక ప్రతి ఒక్కరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంది.
కన్య రాశి : రాబోయే సూర్యగ్రహణం ఈ రాశి వ్యక్తులకు ఆఫీసులో కొన్ని సవాళ్లను తెస్తుంది. సహోద్యోగుల నుండి మద్దతు లేకపోవడం, ఉన్నతాధికారులతో సంబంధాలు దెబ్బతినడం వలన ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వ్యాపారంలో నిమగ్నమైన వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఎటువంటి ముఖ్యమైన పెట్టుబడులు పెట్టవద్దు. ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు.
తుల రాశి : ఈ రాశి వారు సూర్యగ్రహణం వల్ల వచ్చే ప్రతికూల ప్రభావాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. సూర్యగ్రహణం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ రాశి వ్యక్తులు రుణాలు ఇవ్వడం లేదా భారీ పెట్టుబడులు పెట్టడం మానుకోవడం మంచిది. డబ్బులు ఆదా చేసుకోవాలి. ఇది భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)