ఏ రాశివారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలో తెలుసా? ఇలా చేస్తే మీకు తిరుగుండదు
12 జ్యోతిర్లింగాల దర్శనం, పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ లింగాలను దర్శించడం వల్ల అన్ని పాపాలు నశిస్తాయి. దేశంలో ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయో.. జ్యోతిషశాస్త్రంలో అన్ని రాశిచక్ర గుర్తులు ప్రస్తావించబడ్డాయి. ఈ జ్యోతిర్లింగాలను రాశి ప్రకారం దర్శించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు. అందుకే, ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలో తెలుసుకుందాం.

హిందూ మతంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు చాలా పవిత్రమైనవి. శివ పురాణం ప్రకారం.. శివుడు స్వయంగా కాంతి రూపంలో కనిపించి నివసించిన ప్రదేశాలను జ్యోతిర్లింగాలు అంటారు. భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, వీటిని శివుని అనంత శక్తి, కరుణ, సృష్టి రక్షణకు చిహ్నాలుగా భావిస్తారు. జ్యోతిర్లింగాలు కేవలం రాతి లింగాలు కాదు.. అవి శివుని ప్రకాశవంతమైన, నిరాకార, శాశ్వతమైన రూపానికి చిహ్నాలు. ఈ తీర్థయాత్ర స్థలాలను పూజించడం, అభిషేకం చేయడం, సందర్శించడం వల్ల భక్తుల పాపాలు నశిస్తాయని, మనశ్శాంతి లభిస్తుందని నమ్ముతారు. ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుందని విశ్వసిస్తారు.
జ్యోతిర్లింగాలను ఎందుకు దర్శించుకోవాలి?
దేశంలోని ద్వాదశ(12) జ్యోతిర్లింగాలు ప్రత్యేక ప్రాధాన్యతను, విశేషాలను కలిగి ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలను దర్శించిన వారికి మోక్షం లభిస్తుందిన శివపురాణంలో చెప్పబడింది. శివపురాణంలో కోటిరుద్ర సంహిత శివుని 12 జ్యోతిర్లింగాలను గురించి వివరిస్తుంది. అవన్నీ పురాతనమైనవి. ఈ జ్యోతిర్లింగాలన్నింటిలోనూ శివుడు స్వయంగా నివసిస్తున్నాడని నమ్ముతారు.
జ్యోతిర్లింగాలను సందర్శించడం మతపరమైనది మాత్రమే కాదు.. మానసిక, ఆధ్యాత్మికంగా కూడా ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిర్లింగాలను సందర్శించడం వల్ల విశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది, జీవితంలోని కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. చాలా మంది భక్తులు జ్యోతిర్లింగాలను సందర్శించడం వల్ల ఆరోగ్యం, సంపద, మోక్షానికి మార్గం తెరుస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా, మహాశివరాత్రి, శ్రావణ మాసం, సోమవారాల్లో జ్యోతిర్లింగాలను పూజించడం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న జ్యోతిర్లింగాలు దేశ సాంస్కృతిక ఐక్యతకు చిహ్నాలు కూడా. అందువల్ల, జ్యోతిర్లింగాలు కేవలం పుణ్యక్షేత్రాలు మాత్రమే కాదు, విశ్వాసం, సంప్రదాయం, ఆధ్యాత్మిక స్పృహ కేంద్రాలుగా పరిగణించబడతాయి.
12 జ్యోతిర్లింగాల దర్శనం, పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ లింగాలను దర్శించడం వల్ల అన్ని పాపాలు నశిస్తాయి. దేశంలో ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయో.. జ్యోతిషశాస్త్రంలో అన్ని రాశిచక్ర గుర్తులు ప్రస్తావించబడ్డాయి. ఈ జ్యోతిర్లింగాలను రాశి ప్రకారం దర్శించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు. అందుకే, ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలో తెలుసుకుందాం?
మేషం: ఈ రాశి అధిపతి కుజుడు. ఈ రాశి వారు రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని సందర్శించాలి. ఈ జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది.
వృషభం: ఈ రాశి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని సందర్శించాలి. ఇది గుజరాత్‌లో ఉంది.
మిథున రాశి: ఈ రాశి అధిపతి బుధుడు. ఈ రాశిలో జన్మించిన వారు నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని సందర్శించాలి. ఇది కూడా గుజరాత్‌లోనే ఉంది.
కర్కాటకం: ఈ రాశి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారు ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని సందర్శించాలి. ఇది మధ్యప్రదేశ్‌లో ఉంది.
సింహరాశి: ఈ రాశి అధిపతి సూర్యభగవానుడు. ఈ రాశి వారు బైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని సందర్శించాలి. ఇది జార్ఖండ్‌లో ఉంది.
కన్యా రాశి: ఈ రాశి అధిపతి బుధుడు. ఈ రాశి వారు శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని సందర్శించాలి. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.
తులా రాశి: ఈ రాశి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని సందర్శించాలి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో ఉంది.
వృశ్చిక రాశి: ఈ రాశి అధిపతి కుజుడు. ఈ రాశి వారు ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని సందర్శించాలి. ఇది మహారాష్ట్రలో ఉంది.
ధనుస్సు రాశి: ఈ రాశి అధిపతి బృహస్పతి, ఈ రాశి వారు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని సందర్శించాలి. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఉంది.
మకర రాశి: ఈ రాశి అధిపతి శని దేవుడు. ఈ రాశి వారు భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని సందర్శించాలి. ఇది మహారాష్ట్రలో ఉంది.
కుంభ రాశి: ఈ రాశి అధిపతి కూడా శని దేవుడే. ఈ రాశి వారు కేదార్‌నాథ్ జ్యోతిర్లింగాన్ని సందర్శించాలి. ఇది ఉత్తరాఖండ్‌లో ఉంది.
మీనం: ఈ రాశి అధిపతి బృహస్పతి, ఈ రాశి వారు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని సందర్శించాలి. ఇది మహారాష్ట్రలో ఉంది.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.
