
Income Astrology 2025
జ్యోతిషశాస్త్రం ప్రకారం వృత్తి, ఉద్యోగాలపరంగా కాకుండా అదనపు రాబడినిచ్చే గ్రహాలు శుక్ర, రాహువులు. ఈ రెండు గ్రహాలు బలంగా ఉన్నవారు రెగ్యులర్ ఉద్యోగాలు, వృత్తులతో పాటు అదనంగా మరో ఉద్యోగమో, మరో వృత్తో, మరో ఆదాయ మార్గమో కలిగి ఉండడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాల అనుకూలత వల్ల తప్పకుండా అదనపు ఆదాయం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు మీన రాశిలో కలిసి ఉన్నందువల్ల వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, కుంభ రాశుల వారు మే నెల చివరి వరకూ అదనపు ఆదాయం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేసినా సత్ఫలితాలనిస్తాయి.
- వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర, రాహువులు కలిసి ఉన్నందువల్ల అదనపు ఆదాయం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేసినా సత్ఫలితాలు సాధించడం జరుగుతుంది. ఈ ఏడాది చివరి లోపు జీతభత్యాల కంటే అదనపు ఆదాయమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. పార్ట్ టైమ్ ఉద్యోగాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. అదనపు ఆదాయ మార్గాల వల్ల లాభాలు కలుగుతాయి.
- మిథునం: ఈ రాశివారికి దశమ స్థానంలో శుక్ర, రాహువుల కలయిక వల్ల రెండు మూడు ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. పార్ట్ టైమ్ ఉద్యోగాలు, అదనపు ఉద్యోగాల వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. అదనపు నైపుణ్యాలు, ప్రతిభలతో సంపాదనను పెంచుకునే అవకాశం ఉంది. ఈ రాశివారికి షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభించే సూచనలున్నాయి. రెగ్యులర్ ఉద్యోగంతో పాటు రియల్ ఎస్టేట్, వ్యవసాయం, వడ్డీ వ్యాపారాల వంటివి కలిసి వస్తాయి.
- కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్ర, రాహువుల సంచారం వల్ల అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ బాగా కలిసి వస్తాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అసలైన జీతభత్యాల కంటే అదనపు ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల రూపంలోనే కాకుండా ఆస్తిపాస్తుల మీద, ఇంటి అద్దెల మీద వచ్చే ఆదాయం అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది.
- తుల: రాశ్యధిపతి శుక్రుడు ఆరవ స్థానంలో ఉచ్ఛపట్టడంతో పాటు, తనకు ఇష్టమైన రాహువుతో కలిసి ఉన్నందువల్ల తప్పకుండా రెండు మూడు ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది. కొత్త నైపుణ్యాలను అదనపు ఆదాయం కోసం వినియోగించి ఆదాయాన్ని బాగా పెంచుకోవడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర లావాదేవీల వల్ల అపార ధన లాభాలు కలుగుతాయి. ప్రస్తుతానికి వడ్డీ వ్యాపారాలు కూడా బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు రాబడికి అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్ర, రాహువుల కలయిక వల్ల అదనపు ఆదాయానికి ఏ ప్రయత్నం చేసినా విజయవంతం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. భూములు, స్థిరాస్తులు, వడ్డీలు, షేర్లు వంటి వాటి వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల కూడా లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో అదనపు రాబడికి అవకాశం ఉంది. రావలసిన సొమ్మును కొద్ది ప్రయత్నంతో రాబట్టుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి.
- కుంభం: ఈ రాశికి ధన స్థానంలో శుక్ర, రాహువుల సంచారం వల్ల ఆదాయం అనేక మార్గాల్లో పెరిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, ఇంటి అద్దెలు వగైరాల వల్ల బాగా ఆదాయం పెరుగుతుంది. రావలసిన సొమ్మును, బాకీలు, బకాయిలను పట్టుదలగా రాబట్టుకుంటారు. పార్ట్ టైమ్ ఉద్యోగాల ద్వారా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోతుంది.