Lucky Astrology: మకర రాశిలో రెండు గ్రహాల అరుదైన కలయిక.. ఆ రాశుల వారికి అదృష్ట, ఐశ్వర్య యోగం

| Edited By: Janardhan Veluru

Feb 07, 2024 | 6:39 PM

ఈ నెల 12వ తేదీ నుంచి మకర రాశిలో బుధ, శుక్రులు కలవడం జరుగుతుంది. భాగ్యానికి, తెలివితేటలకు కారకులైన ఈ రెండు గ్రహాలు పట్టుదలకు మారుపేరైన మకర రాశిలో కలిసే పక్షంలో తప్పకుండా కొన్నిరాశుల వారికి అనూహ్యమైన అదృష్టం పడుతుంది. సాధారణంగా మకర రాశిలో బుధ, శుక్ర గ్రహాలు ప్రవేశించినప్పుడు తప్పకుండా శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది.

Lucky Astrology: మకర రాశిలో రెండు గ్రహాల అరుదైన కలయిక.. ఆ రాశుల వారికి అదృష్ట, ఐశ్వర్య యోగం
Lucky Astrology
Follow us on

ఈ నెల 12వ తేదీ నుంచి మకర రాశిలో బుధ, శుక్రులు కలవడం జరుగుతుంది. భాగ్యానికి, తెలివితేటలకు కారకులైన ఈ రెండు గ్రహాలు పట్టుదలకు మారుపేరైన మకర రాశిలో కలిసే పక్షంలో తప్పకుండా కొన్నిరాశుల వారికి అనూహ్యమైన అదృష్టం పడుతుంది. సాధారణంగా మకర రాశిలో బుధ, శుక్ర గ్రహాలు ప్రవేశించినప్పుడు తప్పకుండా శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది. కొద్దిగా ప్రయత్నం చేసే పక్షంలో ఐశ్వర్యవంతులయ్యే అవకాశం కూడా ఉంది. సుమారు నెలన్నర రోజుల పాటు ఈ యోగం కొనసాగుతుంది. ఈ సమయంలో చేపట్టే ఎటువంటి ప్రయత్నమైనా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఆ ఆరు రాశులు మేషం, వృషభం, మిథునం, కన్య, మకరం, మీనం.

  1. మేషం: ఈ రాశివారికి బుధ, శుక్రులు దశమ స్థానంలో కలవడం వల్ల అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ఏ నెలన్నర పాటు ఈ రాశివారు విలాసవంతమైన జీవితం, ఇష్టమైన జీవితం గడిపే అవకాశం ఉంటుంది. ఒక విధంగా మంచి రాజయోగం పట్టడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషం అందడం, జీతభత్యాలు పెరగడం జరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడుల వల్ల అధిక లాభం ఉంటుంది.
  2. వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు భాగ్య స్థానంలో తన మిత్ర గ్రహమైన బుధుడితో కలవడం వల్ల ఈ రాశివారి జీవితంలో కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం చేపట్టినా అదృష్టం కలిసి వస్తుంది. సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. భోగభాగ్యాలు అభివృద్ధి చెందుతాయి. విలాసవంతమైన, ఇష్టమైన జీవితం గడపడానికి అవకాశం ఏర్పడుతుంది. దాంపత్య జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
  3. మిథునం: ఈ రాశ్యదిపతి అయిన బుధుడు తన మిత్రక్షేత్రమైన మకర రాశిలో మిత్ర గ్రహమైన శుక్రుడితో కలవడం వల్ల ఈ రాశివారి మనసులోని కోరికలు చాలా భాగం నెరవేరుతాయి. ముఖ్యంగా ఆక స్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సంపద అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. విలాసవంత మైన జీవితం గడుపుతారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారం ప్రారంభించడానికిఇది అనుకూల సమయం. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. దాంపత్య జీవితం మెరుగ్గా ఉంటుంది.
  4. కన్య: ఈ రాశ్యధిపతి అయిన బుధుడు పంచమ స్థితి పొందడం, అక్కడ తన మిత్ర గ్రహమైన శుక్రుడితో కలవడం మహా భాగ్య యోగాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడు తుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. అంచనాలకు మించిన ప్రతి ఫలం, ప్రోత్సాహకాలు దక్కుతాయి. వృత్తి, వ్యాపారాల నిమిత్తం చేసే ప్రయాణాల వల్ల ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.
  5. మకరం: ఈ రాశివారికి బుధ, శుక్రులు రెండూ శుభ గ్రహాలే. ఇవి రెండూ మకర రాశిలోనే పెరగడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సర్వత్రా గౌరవాభిమానాలు పెరుగుతాయి. ప్రాభవం, ప్రాధాన్యం ఇనుమడిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. సిరిసంపదలు కలిసి వస్తాయి. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. ఉద్యోగాలకు సంబంధించి కొత్త ఆఫర్లు అందివస్తాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.
  6. మీనం: ఈ రాశికి లాభ స్థానంలో ఈ బుధ, శుక్రుల కలయిక ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారికి ఆర్థిక ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. దానధర్మాలు ఎక్కువగా చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొం టారు. అప్రయత్నంగానూ, అయాచితంగానూ సంపదలు సమకూరే అవకాశం ఉంది. ఆర్థికపరంగా మంచి అదృష్టం పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం, రాబడి బాగా పెరుగుతాయి. అనేక శుభవార్తలు వింటారు. మంచి ఆఫర్లు అంది వస్తాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.