Digbala Yoga: ఆ రాశులకు దిగ్బల గ్రహ యోగం! వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం..
బుధుడు గానీ, గురువు గానరీ రాశిలో లేదా లగ్నంలో ఉన్నప్పుడు, నాలుగింట శుక్రుడు గానీ, చంద్రుడుగానీ ఉన్నప్పుడు, సప్తమంలో శనీశ్వరుడు, దశమంలో రవి గానీ, కుజుడు గానీ ఉన్నప్పుడు దిగ్బల యోగం వస్తుంది. జ్యోతిష శాస్త్రంలో దిగ్బలానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఏ రాశికైనా, ఏ గ్రహానికైనా దిగ్బలం పట్టినప్పుడు ఆ రాశికి ఒక విధమైన రక్షణ, భద్రత ఏర్పడతాయి. కష్టనష్టాలు తక్కువగానూ, సుఖ సంతోషాలు ఎక్కువగానూ ఉండడం జరుగుతుంది. ఏ పనిచేసినా చెల్లుబాటు అవుతుంది.
జ్యోతిష శాస్త్రంలో దిగ్బలానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఏ రాశికైనా, ఏ గ్రహానికైనా దిగ్బలం పట్టినప్పుడు ఆ రాశికి ఒక విధమైన రక్షణ, భద్రత ఏర్పడతాయి. కష్టనష్టాలు తక్కువగానూ, సుఖ సంతోషాలు ఎక్కువగానూ ఉండడం జరుగుతుంది. ఏ పనిచేసినా చెల్లుబాటు అవుతుంది. ఆ గ్రహ కారకత్వానికి సంబంధించి మంచి యోగం అనుభవానికి వస్తుంది. బుధుడు గానీ, గురువు గానరీ రాశిలో లేదా లగ్నంలో ఉన్నప్పుడు, నాలుగింట శుక్రుడు గానీ, చంద్రుడుగానీ ఉన్నప్పుడు, సప్తమంలో శనీశ్వరుడు, దశమంలో రవి గానీ, కుజుడు గానీ ఉన్నప్పుడు ఈ దిగ్బలం ఏర్పడుతుంది. ప్రస్తుతం మేషం, మిథునం, సింహం, తుల, మకర రాశులకు ఈ దిగ్బల యోగం పట్టింది.
- మేషం: ఈ రాశిలో గురు సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బలం పట్టింది. దీనివల్ల ఈ రాశివారికి ఎటువంటి చెడు ఫలితమూ అనుభవానికి వచ్చే అవకాశం లేదు. ఏదైనా సమస్య ఎదురైనా అది వెనువెంటనే పరిష్కారం అయిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. అందరికీ ఇష్టమైన వ్యక్తి అవుతారు. అవసరమైనప్పుడు వెంటనే సహాయ సహ కారాలు అందుతాయి. సామాజికంగా కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో కలివిడిగా తిరగడం జరుగుతుంది. ఆరోగ్యం ఇబ్బంది పెట్టదు.
- మిథునం: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో శుక్రుడు ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం పట్టింది. మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. గృహ, వాహన సౌకర్యాలు అమర డానికి అవకాశం ఉంది. సతీమణికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది. వినోద యాత్రలు గానీ, తీర్థ యాత్రలు గానీ చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు.
- సింహం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల దిగ్బల యోగం ఏర్పడింది. దీనివల్ల అనారోగ్యాలు, శత్రు బాధలు, ఆర్థిక సమస్యలు దరి చేరవు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. జనాకర్షణ పెరుగుతుంది. రాజకీయ వర్గాలలో ప్రాభవం, ప్రాబల్యం సంపా దించుకుంటారు. రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన స్థిరత్వం లభి స్తుంది. వృత్తి, ఉద్యోగాలలో ప్రత్యేక బాధ్యతలను చేపట్టడం కూడా జరుగుతుంది. ఏ రంగంలోని వారికైనా తప్పకుండా పురోగతి ఉంటుంది. అభాగ్యులకు ఇతోధికంగా సహాయం చేసే అవకాశం ఉంది.
- తుల: ఈ రాశివారికి రాశిలో బుధుడు ఉండడం వల్ల దిగ్బలం ఏర్పడింది. దీనివల్ల ప్రతిభా పాటవాలు వెలుగులోకి రావడం జరుగుతుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో అధికార యోగం పడుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. బంధు మిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేసినా ప్రాధాన్యం ఉంటుంది. మీ సలహాలు, సూచనలకు విలువనివ్వడం జరుగుతుంది.
- మకరం: ఈ రాశివారికి దశమ స్థానంలో కుజ, రవుల సంచారం వల్ల రెండు గ్రహాలకు దిగ్బలం ఏర్పడింది. ఇది వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన స్థానం అయినందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాబల్యం పెరుగుతుంది. అధికార యోగానికి లేదా అధికారులతో అధికారం పంచుకోవడానికి అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ఇది అనుకూలమైన సమయం. అందుకోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాల నిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కష్టనష్టాలు తగ్గిపోతాయి. ఒత్తిడి బాగా తగ్గుతుంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి