AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ 24 రాశిఫలాలు: ఈ రాశులకు ఆదాయం పెరుగుతుంది.. ఉద్యోగ ఒత్తిడి తగ్గుతుంది

Horoscope Today (September 24, 2026): గురువారం 12 రాశుల వారికి గ్రహ సంచార ప్రభావంతో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మేష రాశి వారికి ఆర్థికంగా అనుకూల సమయం కాగా, వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగి ఉద్యోగ ఒత్తిడి తగ్గుతుంది. మిగిలిన రాశుల వారికి కూడా ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, ఆరోగ్య అంశాల్లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం.

సెప్టెంబర్ 24 రాశిఫలాలు: ఈ రాశులకు ఆదాయం పెరుగుతుంది.. ఉద్యోగ ఒత్తిడి తగ్గుతుంది
Rashi Phalalu 24 September 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 24, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (సెప్టెంబర్ 24, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యక్తిగత జీవితంలో మీ సరికొత్త నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. వృషభ రాశి వారికి కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి చాలావరకు తగ్గిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యక్తిగత జీవితంలో మీ సరికొత్త నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. ఒకటి రెండు ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. స్నేహితుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటవుతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. ఆదాయ వృద్ధికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారంలో లాభాలకు లోటుండకపోవచ్చు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. సోదరులతో సఖ్యత బాగా పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్యం పరవాలేదు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి చాలావరకు తగ్గిపోతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. ప్రయాణాల్లో ఆశించిన ఫలితాలను సాధిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. బంధువుల నుంచి శుభ వార్తలు వినడం జరుగుతుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి సానుకూల సమాచారం అందుతుంది. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో ఊహించని విధంగా రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారలుతో చిన్నపాటి సమస్యలు తప్పకపోవచ్చు. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఇష్ట మైన ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఆర్థిక ఒత్తిడి ఉండవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం హ్యాపీగా, ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొందరు సన్నిహితుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. నిరుద్యో గులకు తప్పకుండా కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం అన్నివిధాలా అనుకూలిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అధికారుల్ని పనితీరుతో ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమి స్తాయి. సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సోదర వర్గంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కోరుకున్న ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలకు, కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదా సాటిగా సాగిపోతాయి. ఒక్క క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం మార డానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

‍రోజంతా చాలావరకు ఉత్సాహంగా సాగిపోతుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహ కారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు పోత్సాహకరంగా పురోగమిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తపడాలి. స్వల్ప అనా రోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయం పెరుగుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ, సకాలంలో కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఆధ్యాత్మిక వ్యవ హారాలపై దృష్టి సారిస్తారు. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు కాలం కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం పరవాలేదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో మీ పని తీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని చక్కబెడతారు. స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు వెడతారు. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణ యాలతో ముందుకు వెడతారు. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. స్వల్ప అనా రోగ్యానికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లోనూ, ప్రయాణాల్లోనూ జాగ్రత్తలు పాటించడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలపై శ్రద్ధ పెంచా ల్సిన అవసరం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వివాహ ప్రయ త్నాలు కూడా సానుకూలపడతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు ఫలించి అవసరాలు తీరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్త వుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి సూచనలున్నాయి. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగు తుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

Follow Us