AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ 22 రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

Horoscope Today (September 22, 2026): మంగళవారం 12 రాశుల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మేష రాశి వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృషభ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నా ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరగడంతో పాటు వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మిగిలిన రాశుల వారికి ఆరోగ్యం, ఆర్థికం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం వంటి అంశాల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం.

సెప్టెంబర్ 22 రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
Rashifal In Telugu 22 September 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 22, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (సెప్టెంబర్ 22, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృషభ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా పురోగమిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం పొందుతారు. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరాభిమానాలు పెరుగుతాయి. కొన్ని అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు, కార్యకలాపాలు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

గ్రహ సంచారం ప్రకారం ధన స్థానం పటిష్టంగా ఉంది. ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగుతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు చక్క బడతాయి. ఉద్యోగంలో మీ స్థానం పదిలమవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యల్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే సూచనలున్నాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. విరామం, విశ్రాంతి కూడా కరవవుతాయి. వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధు మిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గే అవకాశం ఉంది. తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. కొందరు బంధుమిత్రులు మిమ్మల్ని తమ సొంత పనులకు ఉపయోగించుకోవడం జరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రోజంతా సానుకూలంగా, ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. దైవ కార్యాల్లోనూ, సహాయ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఏ విషయంలోనూ ఎక్కువగా స్నేహితుల మీద ఆధారపడవద్దు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని సకాలంలో సజావుగా పూర్తి చేయడం జరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. స్థిరాస్తి సంబంధమైన క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో ఏదైనా మంచి జరిగే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో చేపట్టే మార్పులు లాభాలు తెచ్చి పెడతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి జీవితాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. రోజంతా మీకు అనుకూలంగా, మీరు కోరుకున్నట్టుగా సాగిపోతుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఒకటి రెండు కీలక శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో మీ మాటకు, చేతకు ఎదురుండదు. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. ముఖ్యమైన పనుల్లో ఒకటి రెండు ఆలస్యం కావచ్చు కానీ, మిగిలినవి సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటిం చా ల్సిన అవసరం ఉంది. ఇంటా బయటా బాధ్యతలు బాగా పెరుగుతాయి. శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆదాయపు ప్రయత్నాలు ఊపందుకుంటాయి. ముఖ్యమైన పనులు, వ్యవ హారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆస్తికి సంబంధించిన వివాదాల్లో పెద్దలు జోక్యం చేసుకుంటారు. ఇంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదు కానీ, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. మిమ్మల్ని కొందరు సన్నిహితులు స్వార్థానికి ఉప యోగించుకునే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. రోజంతా దాదాపు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. కొత్త పరిచయాలు కలుగుతాయి. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా మారుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆస్తి వివాదాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. ఆర్థికంగా రోజంతా సాఫీగా, సానుకూలంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో ప్రతిభకు, పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం చాలావరకు సహకరిస్తుంది. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

Follow Us