AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్టోబర్ 21 రాశిఫలాలు: ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాల్లో వీరికి గుడ్‌న్యూస్

Horoscope Today (October 21, 2026): బుధవారం నాడు మేష రాశి వారికి ఉద్యోగ బాధ్యతలు పెరగనున్నాయా? వృషభ రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు ఎలా ఉండబోతున్నాయి? మిథున రాశి వారికి ప్రతిభకు తగిన గుర్తింపు లభించనుందా? ఆదాయం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం వంటి విషయాల్లో మేషం నుంచి మీనం వరకు రాశుల వారీగా దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

అక్టోబర్ 21 రాశిఫలాలు: ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాల్లో వీరికి గుడ్‌న్యూస్
Rashi Phalalu 21 Oct 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 21, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (అక్టోబర్ 21, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగతి చెందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

శుభ గ్రహాల అనుకూలత వల్ల రోజంతా చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండకపోవచ్చు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. వ్యక్తిగత ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇష్టమైన బంధు మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆశించిన శుభవార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయి, మానసిక ఒత్తిడి తగ్గు తుంది. గృహ, వాహన సౌకర్యాలకు ప్లాన్ చేస్తారు. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగతి చెందుతాయి. ఆశించిన శుభ వార్తలు వింటారు. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారా లన్నీ పూర్తవుతాయి. కీలక విషయాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరు గుపడుతుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. బంధువులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. ఏ పని తలపెట్టినా నెరవేరుతుంది. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా మారతాయి. ఆరోగ్యం నిల కడగా ఉంటుంది. ఆదాయంలో కొద్దిగా పెరుగుదల కనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూ లంగా, ప్రోత్సాహకరంగా పురోగమిస్తున్నప్పటికీ, వీటి మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. పట్టు దలగా ఆస్తి వ్యవహారాలను చక్కబెడతారు. కుటుంబసమేతంగా ఆలయాలను సందర్శిస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కుటుంబ జీవితంలో కొద్దిగా చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆదాయపరంగా, ఉద్యోగ పరంగా ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేయడం జరుగు తుంది. ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులతో బాధ్యతలు పంచుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలం అవు తాయి. కుటుంబ పరిస్థితులను బాగా చక్కబెడతారు. ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో పోటీదార్ల నుంచి ఇబ్బందులు ఎదురవు తాయి. ధన స్థానంలో బుధ సంచారం వల్ల ఆదాయం పెరగడం, రుణ భారం తగ్గడం వంటివి జరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలను నిర్వహించుకోవడంలో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కొందరు మిత్రుల కారణంగా ఆర్థికంగా నష్టపోతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థికంగా సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. ఆదాయం పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. కొన్ని అద నపు బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది. వ్యాపారాల్ని విస్తరించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. వ్యక్తిగత సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రధానమైన ప్రయత్నాల్లో ఆటంకాలు తొల గిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సమస్యల్ని జాగ్రత్తగా పరిష్కరిం చుకుంటారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా, సామాజికంగా కూడా ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆదాయ ప్రయ త్నాలు సత్ఫలితాలనిస్తాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయంలో ఆశించిన పెరుగుదల కనిపిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు మంచి ఫలితాలనిస్తాయి. ప్రముఖులతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, సకాలంలో వాటిని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా యాక్టివిటీ పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకుంటారు. జీవిత భాగస్వామికి ఆర్థికంగా ఊహించని అదృష్టం పడుతుంది. పిల్లల పురోగతి గురించి ఆశించిన సమాచారం అందుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగి బాగా ఒత్తిడికి గురవుతారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలతో సరి పెట్టుకోవాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా చిన్నా చితకా సమస్యలు తప్పకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొద్దిపాటి అనారోగ్యంతో కూడా బాధపడే అవకాశ ముంది. కుటుంబ, ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. సొంత పనులు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు, పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కరంగా చక్కబడతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగు తుంది. సర్వత్రా మాటకు విలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి పరిచ యాలు ఏర్పడతాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు.

Follow Us