AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగస్టు 22 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలు! ఉద్యోగంలో గుర్తింపు

Horoscope Today (August 22, 2026): శనివారం రాశిఫలాల్లో మేషం, వృషభం, మిథునం సహా 12 రాశుల వారికి గ్రహాల అనుకూలతను బట్టి వివిధ ఫలితాలు కనిపించనున్నాయి. కొందరికి ఉద్యోగంలో గుర్తింపు, అధికారుల ప్రశంసలు లభిస్తే.. మరికొందరికి ఆర్థికంగా, వ్యక్తిగతంగా అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

ఆగస్టు 22 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలు! ఉద్యోగంలో గుర్తింపు
Horoscope Today 22 August 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 21, 2026 | 5:08 PM

Share

దిన ఫలాలు (ఆగస్టు 22, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృషభ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను, సహోద్యోగులను పనితీరుతో ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో కలిసి విహార యాత్ర చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా సజావుగా సాగిపోతుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, అను కోని ఖర్చులతో కొద్దిగా ఇబ్బంది తప్పకపోవచ్చు. ఇష్టమైన వ్యక్తులతో విందులు వినోదాలతో సర దాగా గడుపుతారు. పిల్లల విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు. ఆర్థిక ఒత్తిడి నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆహార, విహా రాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల బాగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సానుకూలంగా సాగుతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ముఖ్యమైన పనుల్ని, వ్యవహారాల్ని తేలికగా పూర్తి చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగం మార డానికి చేసే ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ప్రయత్నాలు పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలనిస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా పురోగమిస్తుంది. కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రతి విషయంలోనూ సానుకూల దృక్పథంతో వ్యవహరించడం అవసరం. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల చదువుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో ఆదరణ లభిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా సాగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. మీ సలహాలు, సూచనలకు విలువ ఏర్పడుతుంది. జీవిత భాగస్వామికి ఆశించిన గుర్తింపు లభి స్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందివస్తాయి. ఇష్టమైనవారితో విందు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం సంతృప్తిని కలిగిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభి స్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవు తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వ హిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా పురోగమిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కీలక విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని ఆశించిన స్థాయిలో లాభపడతారు. కొత్త ప్రయత్నాలకు అవరోధాలు తొలగుతాయి. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. దాంపత్య జీవితం చాలావరకు ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబసమేతంగా ఆలయాలను సందర్శిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిల కడగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వేగంగా పూర్తవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బంధుమిత్రుల వల్ల కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు ఆశించిన విధంగా సత్ఫలితాలనిస్తాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో బాగా బిజీ అవుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అన వసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు భారీగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి, మంచి ఫలితాలు సాధిస్తారు. కొందరు మిత్రుల వల్ల ఇరకాట పరిస్థితులు తలెత్తవచ్చు. సోదరులతో సఖ్యత బాగాపెరుగుతుంది.

Follow Us
ఆగస్టు 22 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలు!
ఆగస్టు 22 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలు!
జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!
జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!
20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..
20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..
దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే
దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే
పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?
పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?
ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..
ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..
రైలు కిటికీ దగ్గర కూర్చొని ఫోన్ పట్టుకుంటున్నారా? జాగ్రత్త..!
రైలు కిటికీ దగ్గర కూర్చొని ఫోన్ పట్టుకుంటున్నారా? జాగ్రత్త..!
గోవా టూర్: హైదరాబాద్ నుంచి విమానంలో.. 4 రోజులు, 3 రాత్రుల ట్రిప్‌
గోవా టూర్: హైదరాబాద్ నుంచి విమానంలో.. 4 రోజులు, 3 రాత్రుల ట్రిప్‌
సంజీవ్ సినిమా రివ్యూ.. ప్రతి కుర్రాడి మనసును తాకే మూవీ..
సంజీవ్ సినిమా రివ్యూ.. ప్రతి కుర్రాడి మనసును తాకే మూవీ..
కరెంట్ పోయినా ఫ్యాన్ ఆగదు..హైబ్రిడ్ సీలింగ్ ఫ్యాన్ గురించి తెలుసా
కరెంట్ పోయినా ఫ్యాన్ ఆగదు..హైబ్రిడ్ సీలింగ్ ఫ్యాన్ గురించి తెలుసా