
దిన ఫలాలు (ఆగస్టు 11, 2026): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. పదోన్నతులకు, జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో వృషభ రాశి వారి ప్రతిభను అధికారులు గుర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు లాభపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. పదోన్నతులకు, జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఆర్థి కంగా ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. మీ సలహాల వల్ల బంధుమిత్రులు లాభపడ తారు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.
ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయం లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. కొందరు స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమలు వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు లాభపడతారు. వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. అసలు ఆదాయం కంటే అదనపు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యానికి లోటుండదు. ఇప్పుడు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపా రాలు లాభాలపరంగా పురోగమిస్తారు. ఆర్థిక సమస్యల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కొద్దిగా మందగిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి.
వృత్తి, ఉద్యోగాల్లో ఏమాత్రం తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కూడా కొద్దిగా శ్రమాధి క్యత ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరిగి ఒత్తిడికి లోనవుతారు. కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు ఒక పట్టాన పూర్తి కావు. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. విద్యా ర్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.
ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి చిన్న పనికీ ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది. మీ నుంచి సాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని స్వయంగా చక్క దిద్దుకోవాల్సి ఉంటుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పిల్లల చదువులపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు. సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా, సాను కూలంగా సాగిపోతాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఇష్టమైన దైవ కార్యాల్లో పాల్గొంటారు.
వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పట్టుదల, గట్టి ప్రయత్నం ఉంటే తప్ప పెండింగ్ పనులు, ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయ్యే అవకాశం లేదు. కొన్ని విషయాల్లో చురుకుగా వ్యవహరించడం మంచిది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది.ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొం టారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి.
వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. చేపట్టిన ప్రతి పనీ సకాలంలో పూర్తవుతుంది. పిల్లల చదువులు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబంతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం తప్పకపోవచ్చు. అధికారుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వ్యక్తిగత సమస్య ఒకటి పరి ష్కారం అవుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.
ఉద్యోగంలో అధికారుల తీరు ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కుటుంబ పరిస్థితుల్ని చక్కబెట్టడం మీద దృష్టి పెడతారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించవచ్చు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ ఆలస్యం అవుతుంది. బంధువుల నుంచి చికాకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.
వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు కూడా ఆశించిన స్థాయిలో తగ్గే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలుంటాయి. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోక పోవడం మంచిది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.