దినఫలాలు (సెప్టెంబర్ 25, 2023): మేషరాశి వారికి సోమవారంనాడు రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. వృషభ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా మంచి ఫలితాలుంటాయి. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం (సెప్టెంబర్ 25,2023) రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. జీవిత భాగస్వామికి ఉద్యోగపరంగా ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరగవచ్చు. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా మంచి ఫలితాలుంటాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు కానీ, కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సమీప బంధువుల ఆరోగ్యా నికి సంబంధించి ఆందోళనకర వార్త వినాల్సి వస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ముఖ్యమైన పనులు, ముఖ్యమైన ప్రయత్నాలు తేలికగా నెరవేరుతాయి. రోజంగా బాగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులకు చేరువవుతారు. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తు లతో పరిచయాలు పెరుగుతాయి కానీ, కొన్ని అనవసర స్నేహాలకు కూడా అవకాశం ఉంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): కుటుంబ సభ్యుల నుంచి కాస్తంత ఒత్తిడి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారికి శుభ వార్త అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరు గుతుంది. వ్యాపారాల్లో రాబడికి ఇబ్బంది ఉండదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చు లను తగ్గించుకోవడం మంచిది. మిత్రుల వల్ల నష్టపోయే సూచనలున్నాయి. విద్యార్థులకు పరవా లేదు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెడతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. రోజువారీ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిం చాల్సి ఉంటుంది. కొత్త ఉద్యోగం విషయంలో విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కొన్ని మంచి పరిచయాలు ఏర్పడతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారా లను వేగంగా పూర్తి చేయాల్సి వస్తుంది. శ్రమ, తిప్పట, వ్యయ ప్రయాసలు కూడా ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్య తలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. స్నేహితుల సహాయ సహకారాలుంటాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఖర్చులు అదుపు తప్పుతాయి. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. చిన్ననాటి స్నేహితు లతో ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను అందుకుంటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశించిన విధంగా పురోగతి చెందుతాయి. ఆదాయానికి లోటుండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే సూచ నలున్నాయి. కుటుంబపరంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. సొంత పనుల మీదా, కుటుంబ వ్యవ హారాల మీదా శ్రద్ధ పెట్టడం అవసరం. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అదనపు ఖర్చులు తప్పక పోవచ్చు. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాలలో మీ నిర్ణయాలు, ఆలోచనలు, వ్యూహాలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఉద్యో గంలో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖు లలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగానే ఉంటాయి. నిరుద్యోగు లకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో కూడా విజయాలు సాధిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఇంటా బయటా బాధ్యతల ఒత్తిడి ఉంటుంది. ఇతరుల బాధ్యతలను నెత్తిన వేసుకుని ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవ హారాలు పూర్తి చేస్తారు. ఒక శుభ కార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): చాలా కాలంగా పెండింగులో ఉన్న కొన్ని ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలను వసూలు చేసు కుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచు తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): సమయం అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొత్త నిర్ణయాలను ఆచ రణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేసి ప్రశంసలందు కుంటారు. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకో వద్దు.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.