దినఫలాలు (అక్టోబర్ 5, 2023): మేష రాశి వారు ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు ఆస్తి వివాదానికి సంబంధించి శుభవార్తలు వింటారు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర, ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఈ రోజంతా ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన పనులు నత్త నడక నడుస్తాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుంది. కొందరు మిత్రులకు సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుంది. పిల్లలు చదువుల్లో, పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆస్తి వివాదానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగంలో అధికారులతో బాధ్యతలు పంచుకోవడం జరుగుతుంది. గృహం కొనుగోలుకు సంబంధించిన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సతీమణికి గుర్తింపు లభిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర, ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు బలం పుంజుకుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామితో సంప్రదించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి, బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రస్తుతానికి ఉద్యోగం మారే అవకాశాలు లేవు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేసుకుంటారు. ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. సోద రులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల సహకారంతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసు కుంటాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. సతీమణితో కలిసి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో నాయకత్వ యోగం కని పిస్తోంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేసి లాభాల బాట పట్టిస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు, పలుకుబడి పెరుగుతాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కాస్తంత ఉపశమనం లభిస్తుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సతీమణితో అన్యోన్యత పెరుగు తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకుం టుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి కానీ, శారీరక శ్రమ ఎక్కువై ఇబ్బంది పడతారు. కుటుంబ వ్యవ హారాలు అనుకూలంగా ఉంటాయి. తండ్రితో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటాయి. కొందరు స్నేహితులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో అధికారులతో బాధ్యతలు పంచుకోవడం జరుగు తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
పెళ్లి సంబంధం విషయంలో బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలోనే కాక, బంధుమిత్రుల్లో కూడా మీ విలువ పెరుగు తుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగం ఆశాజనకంగా సాగిపోతుంది. సతీమణికి వృత్తి, ఉద్యోగాలలో ప్రాభవం పెరు గుతుంది. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అంది వస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు వసూలు అవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగాలలో అందరితో కలిసి మెలిసి పని చేస్తారు. వాహన యోగం ఉంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. సతీమణితో కలిసి భారీగా షాపింగ్ చేస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాల వల్ల ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపి స్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. సతీమణికి చిన్నపాటి అదృష్ట యోగం పడుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. పిల్లలకు చదువు మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఇంటా బయటా కొద్దిగా శ్రమ, ఒత్తిడి ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణ దాతల ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. సతీమణితో కలిసి ఆలయాలు దర్శించడం, దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. మొత్తం మీద ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాలు అనుకూలంగా ముందుకు వెడతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయంతో పదోన్నతి పొందే అవకాశం ఉంది. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది.