Chandra Grahan 2023: ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం బుద్ధ పూర్ణిమ ఒకే రోజు.. బుద్ధ పౌర్ణమి ప్రాముఖ్యత ఏమిటంటే..

|

Apr 21, 2023 | 10:08 AM

మొదటి చంద్రగ్రహణం బుద్ధ పూర్ణిమ నాడు  ఏర్పడుతోంది. ఇదే రోజున గ్రహాలు, రాశుల కలయిక విచిత్రంగా ఉండనున్నాయని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంతేకాదు బుద్ధ పూర్ణిమ రోజున భద్ర నీడ కూడా ఉండనుంది.

Chandra Grahan 2023: ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం బుద్ధ పూర్ణిమ ఒకే రోజు.. బుద్ధ పౌర్ణమి ప్రాముఖ్యత ఏమిటంటే..
Chandra Grahan 2023
Follow us on

ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మే 5వ తేదీ ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం..రాత్రి 8:45 గంటలకు ప్రారంభమై రాత్రి 1:00 గంటలకు ముగుస్తుంది. మొదటి చంద్రగ్రహణం బుద్ధ పూర్ణిమ నాడు  ఏర్పడుతోంది. ఇదే రోజున గ్రహాలు, రాశుల కలయిక విచిత్రంగా ఉండనున్నాయని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంతేకాదు బుద్ధ పూర్ణిమ రోజున భద్ర నీడ కూడా ఉండనుంది. బుద్ధ పూర్ణిమ రోజున ఉదయం 05.38 నుండి 11.27 వరకు భద్ర నీడ ఉంటుంది. ఈ రోజు బుధ పూర్ణిమ గురించి తెలుసుకుందాం..

బుద్ధ పూర్ణిమ ఎందుకు జరుపుకుంటారంటే? 

బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుని జ్ఞాపకార్ధం బుద్ధుడు జన్మించిన రోజున బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటారు. శాక్య వంశంలో జన్మించిన బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థుడు. పుట్టిన వెంటనే జాతకం చెబుతూ.. అయితే సిద్ధార్థుడు గొప్ప రాజ్యపాలకుడు అవుతాడు. లేదా సన్యాసి అవుతాడని జ్యోతిష్కుడు చెప్పాడట.

ఇవి కూడా చదవండి

ఒక రోజు సిద్ధార్థుడు ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో దారిలో కనిపించిన  వృద్ధుడిని, రోగిని, శవాన్ని , సన్యాసిని చూసి.. జీవితం అంటే ఏమిటి అనే ఆలోచన వచ్చిందట. అప్పుడు సిద్ధార్థుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి.. సమాజం గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడట.. 29 ఏట ఇంటి నుండి బయటకు వెళ్లిన సిద్ధార్థుడు.. గౌతమ బుద్ధుడిగా మారాడు.. చివరకు బోధి వృక్షం కింద మోక్షం పొందాడు. అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ.. ప్రజలకు మోక్ష మార్గం గురించి బోధించాడు. తన 80 ఏళ్ల వయస్సులో  తనువు చాలించాడు. బుద్ధుడి మొదలు పెట్టిన మతం బౌద్ధ మతంగా ఖ్యాతిగాంచింది. మన దేశంలో హిందూ మూలాలతో పుట్టిన ఈ మతం.. ఎక్కువ ఆదరణను చైనా, కొరియా, జపాన్ వంటి దేశాల్లో సొంతం చేసుకుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)