మాఘమాసంలోని శుక్ల పక్షం ఏడో రోజున శుద్ధ సప్తమి రోజున రథ సప్తమిగా జరుపుకున్నారు. దీనినే అచల సప్తమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున లోక బాంధవుడు సూర్యభగవానుడిని ఆరోగ్యం ఇవ్వమంటూ నియమ నిష్టలతో పూజించారు. అయితే సూర్యుడి జన్మ దినోత్సవం రోజున భరణి నక్షత్రం కలయికతో బుధాదిత్య యోగం, బ్రహ్మయోగం, ఇంద్రయోగం ఏర్పడ్డాయి. బుధాదిత్య యోగంతో ఈ ఐదు రాశులవారు పట్టిందల్లా బంగారమే అవుతుందట. అదృష్టం వీరి సొంతం.. ఈ రోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..
మకర రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు బుధాదిత్య యోగంతో అన్నింటా అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆర్ధికంగా అభివృద్ధి సాధిస్తారు. అంతేకాదు స్టూడెంట్స్ కు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అంతేకాదు పోటీ పరీక్షల కోసం రెడీ అవుతున్న స్టూడెంట్స్ శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
మిథున రాశి: ఈ రాశికి చెందిన వారికి కూడా బుధాదిత్య యోగం అదృష్టాన్ని లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా తీసుకుని వస్తుంది. ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారస్తులు పెట్టుబడులతో లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కొత్త ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. సూర్యభగవానుడి ఆశీస్సులతో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని అందుకుంటారు.
సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులపై సూర్యుడి ఆశీస్సులు పరంగా ఉంటాయి. వ్యాపారస్తులు లాభాలను అందుకుంటారు. పెళ్లి కోసం ప్రయత్నం చేసేవారు శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో గడుపుతారు. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతో కలిసి పని చేసి ప్రశంసలు అందుకుంటారు.
తుల రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు బుధాదిత్య యోగం అదృష్టాన్ని తెస్తుంది. ఎప్పటి నుంచో పరిష్కారం కానీ సమస్యల నుంచి బయటపడతారు. ఆర్ధిక ఇబ్బందులు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఎప్పటి నుంచో కలవాలని అనుకున్న స్నేహితులను, సన్నిహితులను కలుస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు లాభాలను ఇస్తాయి.
మీన రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులపై సూర్యుడి అనుగ్రహం అపారంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. వ్యాపారస్తులు ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. కొత్త వస్తువులను, ఇల్లు, వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు లభించే అవకాశం ఉంది. ఈ యోగంతో ఈ రాశికి చెందిన వ్యక్తులకు అన్నింటా లాభాలను తెస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు