Mercury Transit
Mercury Transit: సాధారణంగా జాతక చక్రంలో ఏ రాశిలో అయినప్పటికీ రవి, బుధులు కలిసి ఉన్న పక్షంలో ఆ జాతకుడి జీవితం సాఫీగా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఆ సూత్రం కొంతవరకు గ్రహ సంచారంలో కూడా వర్తిస్తుంది. ఈనెల 8వ తేదీ నుంచి బుధ గ్రహం వృషభ రాశిలో ప్రవేశిస్తుంది. ఆ రాశిలో ఇప్పటికే సంచారం చేస్తున్న రవి గ్రహంతో కలుస్తుంది. ఈ రెండు గ్రహాల కలయిక ఈ నెల 16వ తేదీ వరకు కొనసాగుతుంది. దీనివల్ల సమస్యలు, కలతలు, చికాకులు లేని ఒక రకమైన మనశ్శాంతి ఏర్పడుతుంది. ఏ ఏ రాశులకు ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఇక్కడ చూద్దాం.
- మేష రాశి: మేష రాశికి కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు వివాదాలు ఉన్న పక్షంలో అవి అనుకోకుండా తొలగిపోయి ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యంగా ఆదాయం పెరిగి అవసరాలు తీరుతాయి. మాట చెల్లుబాటు అవుతుంది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి కుదుటపడతాయి. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సలహాలు సూచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది.
- వృషభ రాశి: ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో పాటు ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా స్థిరత్వం లభిస్తుంది. అనారోగ్యాలు ఏవైనా ఉంటే వాటికి సరైన వైద్యం లభిస్తుంది. అనవసర ఖర్చులు తగ్గి పొదుపు పాటించడం జరుగుతుంది. సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. ఒకటి రెండు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది.
- మిథున రాశి: ఈ రాశి వారికి తప్పకుండా కొన్ని కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలతో ముందుకు వెళతారు. ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటిస్తారు. భవిష్యత్తు మీద దృష్టి పెడతారు. అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకునే పక్షంలో తప్పకుండా కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది.
- కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ నెలాఖరు వరకు జీవితం ప్రశాంతంగా గడిచిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేసే ఆలోచనల వల్ల భవిష్యత్తులో ఎంతో ఉపయోగముంటుంది. ఏ విషయంలో అయినప్పటికీ సానుకూల దృక్పథంతో వ్యవహరించడం చాలా మంచిది. అదృష్టం కలిసి వచ్చే సమయం ఇది. చిన్న చిన్న ప్రయత్నాలతో జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆరోగ్యంలో ఆశించిన మెరుగుదల కనిపిస్తుంది.
- సింహ రాశి: ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా అధికారులతో ఉన్న విభేదాలు, అపార్ధాలు తొలగిపోయే సూచ నలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించవలసి వస్తుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు మరింతగా వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కు తుంది. అతి చిన్న ప్రయత్నం ఘన విజయం సాధిస్తుంది. గృహ, వాహన, వీసా సంబంధమైన సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆరోగ్యపరంగా కూడా కొంత ఉపశమనం కలుగుతుంది.
- కన్యా రాశి: ఈ రాశికి అధిపతి అయినటువంటి బుధ గ్రహం తొమ్మిదవ స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల పూర్తి స్థాయిలో మనశ్శాంతి ఏర్పడుతుంది. ఒక నెల రోజులపాటు జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. కొన్ని ముఖ్యమైన పనులు ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి దారి దొరుకు తుంది. దాంపత్య జీవితంలో ముఖ్యమైన లోటు పాట్లు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
- తులా రాశి: స్వప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలను పరిష్క రించుకోవడం జరుగుతుంది. వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబంలో కూడా ప్రశాంత వాతా వరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించినంతగా పురోగతి సాధ్యమవుతుంది. పిల్లలు అభివృద్ధి చెందుతారు. వారి నుంచి శుభవార్తలు వింటారు. అన్నిటికన్నా ముఖ్యంగా జీవితానికి సంబంధించి ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రయత్నాలు లోపం ఉండకుండా చూసుకోవాలి.
- వృశ్చిక రాశి: ఈ రాశి వారికి కుటుంబ పరంగా, దాంపత్య పరంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవు తాయి. ముందుచూపుతో వ్యవహరించి ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకుంటారు. ఇతరుల నుంచి రావలసిన డబ్బును వసూలు చేసుకునే పనిలో పడతారు. పొదుపు సూత్రాలు పాటిస్తారు. మన శ్శాంతి కోసం ఒకటి రెండు శుభకార్యాలు కూడా చేపడతారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించే పక్షంలో జీవితం సాఫీగా సాగిపోతుంది.
- ధనూ రాశి: ఈ రాశి వారికి ప్రస్తుతానికి మనశ్శాంతి కంటే శారీరకంగా విశ్రాంతి అవసరం. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మోయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో క్షణం తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. వీటికి తోడు అదనపు ఆదాయ ప్రయత్నాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ పరంగా కొన్ని ముఖ్యమైన బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. ఆదాయం బాగా పెరిగినప్పటికీ అదనపు ఖర్చులు అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి.
- మకర రాశి: ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనప్పటికీ నిబ్బరంగా, ప్రశాంతంగా ఉండే ఈ రాశి వారు ఒక నెల రోజుల పాటు మరింతగా ఉల్లాసంగా ఉండే అవకాశం ఉంది. ఒక పథకం ప్రకారం వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగ, ఆర్థిక సమస్యలను కూడా లౌకికమైన తెలివితేటలతో దూరంగా ఉంచుతారు. అదనపు ఆదాయం ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో ఒక శుభకార్యం కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. ఆరోగ్యం కూడా నిలకడగా ఉండే అవకాశం ఉంది.
- కుంభ రాశి: కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహిత మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన సమస్య లను పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ తీసుకోగలిగిన పక్షంలో ఒక నెల రోజుల పాటు జీవితం ప్రశాంతంగా గడిచిపోయే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా వచ్చే ఆదాయంతో ప్రస్తుతానికి సంతృప్తి చెందడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వినడం వల్ల కొద్దిగా మనశ్శాంతి ఏర్పడుతుంది.
- మీన రాశి: ఈ రాశి వారు సాధారణంగా ఆధ్యాత్మిక చింతనతో, తాత్వికమైన ఆలోచనలతో సొంత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆలయాల సందర్శన, ఆధ్యాత్మిక గ్రంథ పఠనం, ప్రవచనాల ద్వారా మనశ్శాంతి పొందుతూ ఉంటారు. నెలాఖరులోగా ఒకటి రెండు ముఖ్య మైన కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ఆర్థిక సమస్యలు అంతగా బాధించే అవకాశం లేదు. ఆరోగ్యానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..