Horoscope Today(07 జూన్): వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. 12 రాశులవారికి బుధవారంనాటి రాశిఫలాలు..
Horoscope Today (7th June 2023): ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి పూర్తి వివరాలతో 12 రాశుల వారికి బుధవారం (జూన్ 7వ తేదీ)నాటి దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
Horoscope Today (7th June 2023): ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి పూర్తి వివరాలతో 12 రాశుల వారికి బుధవారం (జూన్ 7వ తేదీ)నాటి దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఒకరిద్దరు స్నేహితులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అసంతృప్తి ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగుతాయి.ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి ఉంటుంది.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. వివాదాలకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు సాగిపోతారు.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. కుటుంబ పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులను కూడా సంప్రదించండి. ముఖ్యమైన పనుల్లో బంధుమిత్రులు సహకరిస్తారు.ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీస్తాయి.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. పాజిటివ్ గా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది. ఆరోగ్యం కొంతవరకు కుదుటపడుతుంది. ఆకస్మిక ప్రయాణం తప్పకపోవచ్చు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతున్నా పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. బాగా శ్రమ, తిప్పట ఉంటాయి. కొందరు బంధువుల వల్ల ఇబ్బంది పడతారు.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా చాలావరకు మెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. దూర ప్రాంతం నుంచి మంచి కబురు అందుతుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త ఒకటి మీ చెవిన పడుతుంది. అనుకోని విధంగా మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగరీత్యా ప్రయాణానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండదు కానీ ఖర్చుల కారణంగా ఇబ్బంది పడతారు. బంధుమిత్రులు ఒత్తిడి తెస్తారు. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. స్నేహితులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళతాయి. ఐటీ నిపుణులు మంచి గుర్తింపు తెచ్చు కుంటారు. దూరపు బంధువులతో మంచి వివాహ సంబంధం కుదురుతుంది. అనుకోకుండా అదనపు ఆర్థిక ప్రయోజనాలు మీ ముందుకు వస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయండి. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళతారు.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న సమాచారం ఒకటి అందుతుంది. కుటుంబంలో కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగవద్దు. స్నేహితులతో కూడా అపార్ధాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆర్థిక పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతుంది. పిల్లల కారణంగా ఒక శుభవార్త వింటారు. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధువుల దగ్గర నుంచి డబ్బులు వసూలు అవుతాయి. మిత్రులకు సహాయపడతారు. ఒక శుభకార్యంలో పాల్గొంటారు.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందిస్తుంది. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. సన్నిహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొద్దిగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆదాయంలో మెరుగుదల కనిపిస్తుంది కానీ శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది. బంధు మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి.
ఇవి కూడా చదవండి
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..