
Birth Star Astrology
Luck Astrology in Telugu: ఈ ఏడాది తొమ్మిది నక్షత్రాల వారికి జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. వీరికి జీవితం ఒక గొప్ప మలుపు తిరగడం ఖాయమని చెప్పవచ్చు. ఈ నక్షత్రాలు ఉన్న రాశులను బట్టి, ఈ నక్షత్రాల గుండా సంచారం చేస్తున్న ప్రధాన గ్రహాలను బట్టి, ఈ నక్షత్రాలను వీక్షిస్తున్న శుభగ్రహాలను బట్టి ఈ నక్షత్రాలకు అనూహ్యమైన బలం పట్టబోతోంది. వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు, విదేశీయానం, ఆర్థిక పరిస్థితి, గృహ, వాహన సౌకర్యాలు వంటి విషయాల్లో భారీ ఎత్తున సానుకూల మార్పులు, చేర్పులు జరుగుతాయని చెప్పవచ్చు. ఈ నక్షత్రాలకు విపరీత రాజయోగం పట్టబోతున్నట్టు కనిపిస్తోంది. ఆ నక్షత్రాలు అశ్విని, రోహిణి, పునర్వసు, పుష్యమి, పుబ్బ, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాఢ, పూర్వాభాద్ర. వీటిని గురించిన వివరాలు తెలుసుకుందాం.
- అశ్విని: ఈ రాశివారికి త్వరలో విదేశీయాన యోగం పట్టే అవకాశం ఉంది. ఈ రాశివారికి ఈ ఏడాది డాలర్లు తినే యోగం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సాటి లేని మేటి అనిపించుకుంటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వీరికే కాకుండా వీరి కుటుంబానికి కూడా మంచి శుభ యోగం పట్టే సూచనలున్నాయి. అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది.
- రోహిణి: ఈ నక్షత్రం వారు ఎంత తక్కువ స్థితిలో ఉన్నా సంపన్నులు కావడం ఖాయమని చెప్పవచ్చు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి వీరి జీవితంలో అనేక సానుకూల మార్పులు, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా ఆదాయం బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల ద్వారా ఆదాయం కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. పిల్లలు విశేష ప్రజ్ఞావంతులు కావడం జరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి సైతం కోలుకుంటారు.
- పునర్వసు: ఈ నక్షత్రం వారికి జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వీటివల్ల సమీప భవిష్యత్తులోనే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అధికార యోగం పడుతుంది. అక్టోబర్ 24 తర్వాత నుంచి వీరి తప్పకుండా రాజయోగం పడుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందని చెప్ప వచ్చు.
- పుష్యమి: చాలా కాలంగా పడుతున్న కష్టనష్టాల నుంచి పూర్తిగా విముక్తి లభించి కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. తప్పకుండా అధికార యోగం పడుతుంది. విదేశాల్లో ఉద్యోగం సంపాదించే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. కొంత కాలంగా పీడిస్తున్న వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి అప్రయత్నంగా ఊరట లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వీరి వల్ల చాలామందికి అనేక విధాలుగా ఉపకారం జరుగుతుంది.
- పుబ్బ: ఈ నక్షత్రం వారు ఉన్నత స్థానంలోకి వెళ్లడం, ఒక ప్రముఖ వ్యక్తిగా చెలామణీ కావడం జరుగుతుంది. సెప్టెంబర్ 2వ తేదీ తర్వాత నుంచి వీరి జీవితం మలుపులు తిరగడం ప్రారంభం అవుతుంది. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా మారుతుంది. సంపన్నుల కుటుంబంలో పెళ్లి కుద రడం, ఆకస్మిక ధన లాభం, ఆస్తి కలసి రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి.
- స్వాతి: వృత్తి, వ్యాపారాలకు సంబంధించి వీరికి విపరీత రాజయోగం పడుతుంది. వీరి ఆలోచనలు, వ్యూహాలతో వృత్తి, వ్యాపారాలు అనూహ్యంగా లాభాలు పండిస్తాయి. ఈ నక్షత్రం వారు ఏ రంగంలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా తప్పకుండా తిరుగులేని పురోగతి సాధిస్తారు. సమాజంలో పలుకు బడి పెరుగుతుంది. వీరి పరిచయం లేదా స్నేహం కోసం ప్రముఖులు ఆరాటపడతారు. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వచ్చి గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. మనసులోని కోరికలు నెర వేరుతాయి.
- అనూరాధ: ఈ నక్షత్రం వారికి విశేషమైన ధనయోగం పడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అంచనాలకు మించి విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. స్థిరాస్తి కలిసి వస్తుంది. దీనికి సంబంధించిన యోగం ఇప్పటికే ప్రారంభం అయిపోయి ఉంటుంది. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి కూడా ఊహించని పురోగతి సాధిస్తారు. అధికార యోగం పడుతుంది. విదేశీ యాన యోగం కూడా పట్టే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి విముక్తి లభిస్తుంది.
- ఉత్తరాషాఢ: ఈ రాశివారికి ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. సమాజపరంగా గౌరవ మర్యాదలు పెరగడం, సత్కారాలు, సన్మానాలు జరగడం, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, మాటకు, చేతకు విలువ పెరగడంవంటివి జరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కూడా అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ వీరి జీవితం ఒక గొప్ప మలుపు తిరగడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా బలం పెరుగుతుంది.
- పూర్వాభాద్ర: వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా వీరి ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధన యోగానికి అవకాశం ఉంది. వారసత్వంగా ఆస్తి, సంపద సంక్రమిస్తాయి. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అది సఫలం అవుతుంది. ఇతరుల నుంచి సహాయం పొందిన వారు కూడా ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. ఉద్యోగంలో అధికార యోగా నికి, ప్రమోషన్ కు అవకాశం ఉంది. ఉద్యోగపరంగా విదేశీయాన యోగం కూడా ఉంది.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.