Bhanu Saptami: నేడు భానుసప్తమి.. 11 ఏళ్ల తర్వాత శుభయోగం.. ఈరోజు సూర్యుడి పూజ అత్యంత ఫలవంతం.. పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు..

|

Jun 25, 2023 | 7:13 AM

ఆషాఢ మాసంలో ఆదివారం రోజు సప్తమి తిధి కలవడంతో భానుసప్తమి ప్రాముఖ్యత మరింత పెరిగింది.  ఎందుకంటే ఆషాఢ మాసానికి అధిపతి సూర్యుడే. అందుకే ఆషాఢమాసంలో సూర్యుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో నేడు భాను సప్తమి తిథి ఆదివారం రోజంతా ఉంటుంది. ఆషాఢమాసం, ఆదివారం , సప్తమి తిథి సంగమం ఈ రోజును అరుదైన యోగంగా మార్చింది. ఈ మూడింటికి అధిపతి సూర్యుడు. ఇదే యోగం 11 సంవత్సరాల క్రితం జూన్ 10, 2012 న ఏర్పడింది., మళ్ళీ నేడు ఈ యోగం కలిగింది.

Bhanu Saptami: నేడు భానుసప్తమి.. 11 ఏళ్ల తర్వాత శుభయోగం.. ఈరోజు సూర్యుడి పూజ అత్యంత ఫలవంతం.. పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు..
Bhanusaptami 2023
Follow us on

ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చేయబడిన రోజు. ప్రత్యక్ష దైవం.. నవగ్రహాలకు అధినేత సూర్యనారాయణుడిని ఆదివారం పూజించడం అత్యంత ఫలప్రదం అని హిందువుల నమ్మకం. ఆరోగ్య ప్రదాత భానుడికి సూర్యోదయ సమయంలో ఇచ్చే అర్ఘ్యం వ్యాధి నివారణ చేస్తుందని.. సుఖ సంపదలను ఇస్తుందని విశ్వాసం. ఇక ఏదైనా తెలుగు నెలలో ఆదివారం రోజున సప్తమి తిధి వచ్చినట్లు అయితే ఆ రోజు చేసే సూర్యారాధన విశేష ఫలప్రదమని పండితులు చెబుతున్నారు. ఆదివారం సప్తమి తిధి వస్తే.. ఆ  సప్తమిని భానుసప్తమి, విజయ సప్తమి, కల్యాణ సప్తమి అని కూడా పిలుస్తారు. నేడు భానుసప్తమి ..

ఆషాఢ మాసంలో ఆదివారం రోజు సప్తమి తిధి కలవడంతో భానుసప్తమి ప్రాముఖ్యత మరింత పెరిగింది.  ఎందుకంటే ఆషాఢ మాసానికి అధిపతి సూర్యుడే. అందుకే ఆషాఢమాసంలో సూర్యుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో నేడు భాను సప్తమి తిథి ఆదివారం రోజంతా ఉంటుంది. ఆషాఢమాసం, ఆదివారం , సప్తమి తిథి సంగమం ఈ రోజును అరుదైన యోగంగా మార్చింది. ఈ మూడింటికి అధిపతి సూర్యుడు. ఇదే యోగం 11 సంవత్సరాల క్రితం జూన్ 10, 2012 న ఏర్పడింది., మళ్ళీ నేడు ఈ యోగం కలిగింది.

భానుసప్తమి రోజున సూర్య దేవుడికి సంబంధించిన పర్వదినం. ఈ రోజున చేసే పూజ, దానం, జపం, హోమం అత్యంత ఫలవంతం అని.. లక్ష రేట్లు ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం.

ఇవి కూడా చదవండి

సూర్యోదయానికి ముందే నిద్రలేచి శిర స్నానమాచరించి.. సూర్యుడికి అర్ఘ్యన్ని అందించాలి.  అంతేకాదు ఈ రోజు శరీరానికి తలకు నూనెను పెట్టుకోరాదు. ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి.

ఈ పూజా నియమాలు ఒక్క భాను సప్తమి రోజునే కాదు.. ప్రతి ఆదివారం విధిగా పాటించమని లయకారుడు శివుడు సూర్యాష్టకంలో చెప్పారు.

శ్లోకం౹౹ ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా౹౹

శ్లోకం౹౹ స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి౹౹

అంటే ఆదివారం అందునా భానుసప్తమి రోజున మద్యం, మాసం, వెల్లుల్లి, మొదలైనవి తినేవాడు ఏడు  జన్మల పాటు రోగాలతో బాధపడతాడు. అంతేకాదు ఆజన్మాంతం దరిద్రంతో ఇబ్బందులు పడతాడని .. అంతేకాదు భానుసప్తమి రోజున స్త్రీ సంగమం, నూనె రాసుకోనుట, మద్య, మాంసాలను ఆదివారం విడిచిపెట్టినవానికి శోకం, వ్యాధి, దారిద్యం ఉండదు. అంతేకాదు నియమాలతో సూర్యుడిని పూజించిన వారికీ సూర్యలోక ప్రాప్తి ఉంటుందని విశ్వాసం.

సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ నీరు,  అక్షతలు, పూలు తీసుకుని ఉపవాస వ్రత దీక్ష చేపట్టాలి. ఒక రాగి పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకుని అందులో ఎర్రటి పువ్వులు, కుంకుమ వేసి.. ఆ నీటితో సూర్య భగవానుడికి అర్ఘ్యన్ని అర్పించాలి. అర్ఘ్యన్ని ఇస్తున్నప్పుడు ‘ఓం సూర్యాయ నమః’ మంత్రాన్ని జపిస్తూ ఉండండి

ఈ రోజు చేసే సూర్యభగవానుడిని పూజించి ఆవు పాలతో చేసిన పరమాన్నం శ్రీ సూర్య భగవానుడికి నైవేద్యంగా సమర్పించినట్లు అయితే ఆదినారాయణుడు అనుగ్రహం సొంతం అవుతుందని విశ్వాసం.

సూర్యుడి అనుగ్రహం కోసం పాటించాల్సిన మంత్రాలు

ఆదివారం సూర్యుడి అనుగ్రహం కోసం ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అంటూ జపించినా..  సూర్యాష్టకం, ఆదిత్యహృదయం, సూర్య ద్వాదశనామాలు పఠించినా అత్యంత శ్రేష్టం.. అంతేకాదు సూర్యోదయ సమయంలో చేసే సూర్య నమస్కారాలు శుభ ఫలితాలను, కార్య సిద్ధిని ఇస్తాయి.. ఆరోగ్యాన్ని అందిస్తాయని పురాణాల వచనం.

ఆదివారం సూర్యారాధనతో కలిగే ఫలితాలు.. 

వివాహం కానీ యువతీ యువకులకు వివాహం జరుగుతుంది.

సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు సంతానం కలుగుతుంది

విద్య, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది

మానసికంగా ఇబ్బందులు పడుతున్నవారికి మనశ్శాంతి లభిస్తుంది

ఆరోగ్యంగా ఉంటారు.

ఈ రోజు సూర్యుడికి చేసే పూజ అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది. ఇంట్లో సుఖ సంపదలు నెలకొంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).