Lunar Eclipse: సెప్టెంబర్ 07న చంద్రగ్రహణం.. ఈ రెండు రాశుల వారిపై ప్రభావం.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిది..

వేద పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 7న భాద్రపద పూర్ణిమ నాడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. కనుక సూతకం కూడా వర్తిస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ చంద్ర గ్రహణ సమయంలో రెండు రాశుల వారు ఈ సమయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. శివుని నామాన్ని జపించడం, మంత్రాలను జపించడం ద్వారా రక్షణ పొందవచ్చు. ఆ రాశులు వారు ఎవరో తెలుసుకుందాం..

Lunar Eclipse: సెప్టెంబర్ 07న చంద్రగ్రహణం.. ఈ రెండు రాశుల వారిపై ప్రభావం.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిది..
Lunar Eclipse

Updated on: Aug 24, 2025 | 6:54 AM

హిందూ మతంలో భాద్రపద పూర్ణిమ ఒక ముఖ్యమైన పౌర్ణమి తిథి. వేద పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం పౌర్ణమి సెప్టెంబర్ 07 ఆదివారం నాడు వచ్చింది. ఈ శుభ సందర్భంగా ఉదయం స్నానం, ధ్యానం తర్వాత లక్ష్మీ నారాయణ స్వామిని పూజిస్తారు. కొంతమంది ఉపవాసం కూడా పాటిస్తారు. అయితే ఈ ఏడాది బద్రపౌర్ణమి రోజున రెండవ చివరి చంద్ర గ్రహణం ఏర్పడనుంది.

ఈ చంద్ర గ్రహణం ప్రత్యేకత ఏమిటంటే ఈ సంవత్సరం భారతదేశంలో కనిపిస్తుంది. కనుక గ్రహణ సూతక కూడా చెల్లుతుంది. జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సమయంలో రెండు రాశుల వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి:
భాద్రపద పూర్ణిమ రోజున కుంభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ శుభ దినాన చంద్రుడు కుంభ రాశిలో ఉంటాడు. అయితే రాహువు ఇప్పటికే కుంభ రాశిలో ఉన్నాడు. అందువల్ల చంద్రుడు, రాహువు కలయిక వలన కుంభ రాశి వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. మానసిక ఒత్తిడి సమస్య ఉంటుంది. ఎవరితోనైనా వివాదం ఏర్పడవచ్చు. మనస్సు గందరగోళంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మీరు ఏదైనా చేయాలని అనుకుంటే.. అడ్డంకులు ఎదురుకావచ్చు. భయం మీ మనస్సులో అలాగే ఉంటుంది. రాహువు చెడు దృష్టి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి శివ నామ జపం చేయడం మంచిది. దీనితో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా జపించడం వలన విశేష ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కూడా ఈ చంద్రగ్రహణం అశుభకరంగా పరిగణింపబడుతున్నది. వీరికి చాలా అవాంఛనీయ ఫలితాలు వస్తాయి, దీనివల్ల మనస్సు చంచలంగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎటువంటి కారణం లేకుండా మనస్సులో అశాంతి ఉంటుంది. దీని కారణంగా ఎవరితోనైనా వాదనకు వెళ్ళే అవకాశం ఉంది. శుభ కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. తల్లి ఆరోగ్యం బాగాలేకపోవచ్చు. శారీరక బాధలు ఉండవచ్చు. వీరు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చంద్రుని ఆశీస్సులు పొందడానికి శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించండి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.