- Telugu News Photo Gallery Spiritual photos Budh Gochar in Simha Rashi These zodiac signs to get relief from problems in life details in Telugu
Budh Gochar: బుధాదిత్య యోగం.. ఈ రాశులకు కష్టనష్టాల నుంచి విముక్తి ఖాయం..!
Budhaditya Yoga: ఈ నెల (ఆగస్టు) 31 నుంచి సెప్టెంబర్ 16 వరకు సింహ రాశిలో బుధుడి సంచారం జరుగుతోంది. సింహ రాశికి అధిపతి అయిన రవి కూడా ప్రస్తుతం ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల శక్తిమంతమైన బుధాదిత్య యోగం ఏర్పడింది. ఈ పదహారు రోజుల కాలంలో కొన్ని రాశుల వారికి ఊహించని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగాల్లో స్థిరత్వం కలగడం, ఉద్యోగాలు సంపాదించడం, ఉద్యోగాలు మారడం, వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపట్టడం, ఆర్థిక, గృహ ఒప్పందాలు కుదరడం, ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కావడం, ఇంటా బయటా గుర్తింపు రావడం, సలహాలు, సూచనలకు విలువ పెరగడం వంటివి జరుగుతాయి. వృషభం, కర్కాటకం, సింహం, తుల, ధనూ రాశుల వారు ఈ కలయిక వల్ల శుభ ఫలితాలు పొందబోతున్నారు.
Updated on: Aug 23, 2025 | 7:06 PM

వృషభం: ఈ రాశికి బుధ, రవులు అత్యంత శుభ గ్రహాలైనందువల్ల ఈ రాశివారికి రాజయోగాలను, ధన యోగాలను ఇచ్చే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వార సత్వ సంపద లభిస్తుంది. సొంత ఇంటి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మాతృ సౌఖ్యం లభిస్తుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలకు అవకాశం ఉంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో బుధాదిత్య యోగం చోటు చేసుకోవడం వల్ల షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల ఉద్యోగంలో అధికారులు బాగా లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

సింహం: ఈ రాశిలో బుధాదిత్య యోగం చోటు చేసుకుంటున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లబిస్తుంది. ఉన్నతస్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆర్థిక ఒప్పం దాలు కుదురుతాయి. నిరుద్యోగులు, విద్యార్థులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

తుల: ఈ రాశికి లాభ స్థానంలో రవి, బుధుల కలయిక జరుగుతున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగుతుంది.

వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడం గానీ లేదా ఉన్నత పదవులకు అవకాశం ఉన్న సంస్థలోకి మారడం గానీ జరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ది చెందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధ, రవుల సంచారం వల్ల విదేశీ సంపాదన యోగం పడుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పిత్రార్జితం గానీ, వారసత్వ సంపద గానీ లభిస్తుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.



