Gaja lakshmi Yoga: ఏర్పడిన గజలక్ష్మి యోగం.. అక్టోబర్ వరకూ ఈ మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

|

Aug 03, 2023 | 1:18 PM

వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రుడు ఆగష్టు 3న కర్కాటకరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. దీంతో ఇది గజలక్ష్మి రాజయోగాన్ని ఏర్పడుతుంది. ఈ గజలక్ష్మి యోగం తుల, మిథున , కన్యా రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు గజలక్ష్మి రాజయోగం ఎలా ఏర్పడుతుందో తెలుసుకోండి. రాహువు ఇప్పటికే మేషరాశిలో ఉండి, బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు గజలక్ష్మీ యోగం ఏర్పడుతుంది.

Gaja lakshmi Yoga: ఏర్పడిన గజలక్ష్మి యోగం.. అక్టోబర్ వరకూ ఈ మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
Gaja Lakshmi Yoga
Follow us on

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాశులు, యోగా చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. అదే సమయంలో నిర్దిష్ట సమయ విరామం తర్వాత గ్రహాలు తమ కదలికను మార్చుకోవడంతో రాజ్యయోగం ఏర్పడుతుంది.  ఇది రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రుడు ఆగష్టు 3న కర్కాటకరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. దీంతో ఇది గజలక్ష్మి రాజయోగాన్ని ఏర్పడుతుంది. ఈ గజలక్ష్మి యోగం తుల, మిథున , కన్యా రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు గజలక్ష్మి రాజయోగం ఎలా ఏర్పడుతుందో తెలుసుకోండి

రాహువు ఇప్పటికే మేషరాశిలో ఉండి, బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు గజలక్ష్మీ యోగం ఏర్పడుతుంది. ఈ రాశిలో గజలక్ష్మి యోగం ఏర్పడడంతో శని ఏలి నాటి శని ముగిసి.. సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆర్ధిక ఇబ్బందులు తీరతాయి.

శుక్రుని  తిరోగమన నుండి ఏ రాశుల వారు ప్రయోజనం పొందుతారంటే..

తుల రాశి: గజలక్ష్మీ రాజయోగం శుభప్రదం. ఉద్యోగంలో ఉన్న వారు ఈ సమయంలో పదోన్నతులు పొందే అవకాశం ఉంది. వస్తు సౌఖ్యాలు, సౌకర్యాలు పెరుగుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందవచ్చు.  వ్యాపారంలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఆఫీసులో సహోద్యోగులతో మీ సంబంధాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మిథున రాశి: మిథున రాశి వారికి గజలక్ష్మి రాజయోగం శుభప్రదం. ఖర్చుపై మునుపటి కంటే నియంత్రణ ఉంటుంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. మీడియా, మార్కెటింగ్, విద్య లేదా కమ్యూనికేషన్‌తో అనుబంధించబడిన వ్యక్తులకు సమయం అద్భుతంగా ఉంటుంది. శుక్రుడు తిరోగమనం కారణంగా, ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.

కన్య రాశి: ఈ రాశివారికి గజలక్ష్మి రాజయోగం ప్రయోజనకరంగా ఉంటుంది. పాత పెట్టుబ‌డుల‌తో ధన లాభం ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త‌లు అందుకుంటారు. షేర్ మార్కెట్, బెట్టింగ్, లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల ప్రజలు ప్రయోజనం పొందుతారు. ప్రణాళికలు విజయవంతమవుతాయి. కొత్త ఆదాయ వనరులు సృష్టించుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)