Horoscope Today: ఈ రాశివారు ఉద్యోగ, వ్యాపారాల్లో అప్రమత్తత అవసరం.. మంగళవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

ఉద్యోగ వ్యాపారాల్లో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. వృత్తి నిపుణులు మంచి గుర్తింపు పొందుతారు. ఒక విదేశీ సంస్థ నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది.

Horoscope Today: ఈ రాశివారు ఉద్యోగ, వ్యాపారాల్లో అప్రమత్తత అవసరం.. మంగళవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Jan 31, 2023 | 5:00 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గ్రహాల స్థితిగతులు బాగానే ఉన్నందువల్ల రోజంతా ప్రశాంతంగానే గడిచిపోతుంది. దానధర్మాలు లేక వితరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారులు మీ సలహాలను తీసుకుంటారు. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆస్తి సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులు బాగా రాణించే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఒక మంచి పెళ్లి సంబంధాన్ని కుదర్చడంలో బంధువులు సహాయం చేస్తారు. ఉద్యోగ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి. ఉద్యోగంలో లక్ష్యాలను పూర్తి చేయడంలో సహచరులు సహకరిస్తారు. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు అందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మంచి కంపెనీ నుంచి ఆఫర్ అందుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ వ్యాపారాల్లో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. వృత్తి నిపుణులు మంచి గుర్తింపు పొందుతారు. ఒక విదేశీ సంస్థ నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరు చదువు లేదా ఉద్యోగం కోసం దూర ప్రాంతానికి వెళ్లే సూచనలు ఉన్నాయి. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం వస్తుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అదృష్ట యోగం పట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో మాట చెల్లుబాటు అవుతుంది. ప్రమోషన్ మీద బదిలీకి అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ ఉత్తర 1)

ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. కానీ అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. అదనపు ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్లడం మంచిది, ఉద్యోగంలో పని భారం పెరిగే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బందు వర్గంలో మంచి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కొద్ది ప్రయత్నంతో అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. పరిచయస్తుల ద్వారా పెళ్లి సంబంధం కుదురు తుంది. ఆరోగ్యం సానుకూల పడుతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. దూరప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక పరిస్థితి, లాభాల పరిస్థితి చాలా వరకు మెరుగ్గానే ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆస్తి విలువ పెరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. కొందరు బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదరవచ్చు. సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

తోబుట్టువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇరుగుపొరుగుతో అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. స్నేహితుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లోనూ, స్వయం ఉపాధిలోను ముందుకు దూసుకు వెళతారు. ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యానికి కొరత ఉండదు. వ్యక్తిగత పనుల రీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది. వ్యాపారంలో పెట్టుబడి పెంచే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనాయాసంగా పరిష్కారం అవుతుంది. బంధుమిత్రులతో అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆదాయానికి సంబంధించిన ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధువుల ప్రచారాలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు ఒత్తిడికి గురిచేస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇతరులకు వాగ్దానాలు చేయటం కానీ, హామీలు ఇవ్వటం కానీ చేయకపోవడం మంచిది. డబ్బు జాగ్రత్త.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు. శుభకార్యాల మీద ఖర్చు పెరుగుతుంది. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. దూరప్రాంతం నుంచి పిల్లలు చూడటానికి వస్తారు. ఉద్యోగరీత్యా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి అంది కొన్ని అవసరాలు తీరుతాయి. వృత్తి నిపుణులు ఉద్యోగరీత్యా స్థిరపడతారు. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు