February Horoscope: ఫిబ్రవరిలో నాలుగు గ్రహాల మార్పు.. 7 రాశుల వారికి అదృష్టం సొంతం.. ఆదాయం సంపద రెట్టింపు..

ఫిబ్రవరిలో.. మేధస్సు, వాక్కు, వ్యాపారం, గణిత శాస్త్రాలకు కారకుడైన బుధుడు తన రాశిని మార్చుకోనున్నాడు. శనీశ్వరుడి రాశి అయిన మకరరాశిలో సంచరిస్తాడు. బుధుడు ఫిబ్రవరి 7, 2023న మకరరాశిలోకి ప్రవేశిస్తాడు.  

February Horoscope: ఫిబ్రవరిలో నాలుగు గ్రహాల మార్పు..  7 రాశుల వారికి అదృష్టం సొంతం.. ఆదాయం సంపద రెట్టింపు..
Horoscope
Follow us
Surya Kala

|

Updated on: Jan 30, 2023 | 7:25 AM

2023 సంవత్సరం ఫిబ్రవరి నెలలో.. అనేక పెద్ద గ్రహాలు తమ రాశి గమనాన్ని మార్చుకోనున్నాయి. శనీశ్వరుడు తన రాశిని మార్చుకోవడంతో  ఫిబ్రవరి నెల ప్రారంభం అవుతుంది. ఇదే నెలలో సూర్యుడు, బుధుడు, శుక్ర గ్రహాలు కూడా తమ స్థానాలను మార్చుకోనున్నాయి. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గ్రహాల రాశి మార్పు ముఖ్యమైనది. గ్రహాల రాశిలో మార్పు కారణంగా..  ప్రత్యేక ప్రభావం.. శుభం, అశుభం, స్థానికుల జీవితాలపై ప్రభావం పడనుంది. ఫిబ్రవరి నెలలో గ్రహాల రాశులు ఎప్పుడు, ఎన్నిసార్లు మారనున్నాయో తెలుసుకుందాం.

మకరరాశిలో బుధుడి సంచారం  ఫిబ్రవరిలో.. మేధస్సు, వాక్కు, వ్యాపారం, గణిత శాస్త్రాలకు కారకుడైన బుధుడు తన రాశిని మార్చుకోనున్నాడు. శనీశ్వరుడి రాశి అయిన మకరరాశిలో సంచరిస్తాడు. బుధుడు ఫిబ్రవరి 7, 2023న మకరరాశిలోకి ప్రవేశిస్తాడు.

కుంభరాశిలో రవి సంచారం  జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మార్చుకుంటాడు. సూర్యుడు మకరరాశి లో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. సనాతన ధర్మంలో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సూర్యుడు ప్రస్తుతం మకరరాశిలో సంచరిస్తున్నాడు. అయితే సూర్యుడు ఫిబ్రవరి 13న తన మకర రాశిలో తన ప్రయాణాన్ని నిలిపివేసి.. శనీశ్వరుడు అధిపతి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు.

ఇవి కూడా చదవండి

మీన రాశిలో శుక్రుని సంచారం జాతకంలో శుక్రుని శుభ ప్రభావంతో.. వ్యక్తి తన జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలను పొందుతాడు. ఫిబ్రవరి 15న శుక్రుడు మీనరాశిలో బృహస్పతి రాశిలో సంచరిస్తాడు.

కుంభరాశిలో బుధుడు సంచారం శుక్రుని సంచారం తర్వాత.. బుధుడు మరోసారి తన రాశిని మార్చుకుంటాడు. బుధుడు ఈసారి కుంభరాశిలో సంచరిస్తాడు. ఫిబ్రవరి 27న సాయంత్రం 4.33 గంటలకు బుధుడు తన గమనాన్ని మార్చుకోనున్నాడు.

బుధుడు కుంభరాశిలో అస్తమిస్తాడు ఫిబ్రవరి చివరి రోజుల్లో తన స్థానాన్ని మార్చుకున్న బుధుడు కుంభరాశిలో అస్తమిస్తాడు. ఒక గ్రహం సూర్యుడికి అతి దగ్గరగా వచ్చినప్పుడల్లా దానిని అష్ట అంటారు. గ్రహాలు అస్తమించినప్పుడు పూర్తి ఫలితాలు ఇవ్వవు.

ఫిబ్రవరిలో ఏ రాశులవారిపై ప్రభావం చూపనుందంటే..  గ్రహాల రాశిలో మార్పు కారణంగా..  ఫిబ్రవరి కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. మరికొందరికి సమస్యలు పెరుగుతాయి.

ఈ 7 రాశుల వారికి ఫిబ్రవరి శుభప్రదంగా ఉంటుంది మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి ఫిబ్రవరి నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశుల వారు తమ కెరీర్‌లో మంచి ఫలితాలను పొందుతారు. వీరు ఆఫీసులో చేస్తున్న పనుల్లో ఆధిపత్యం చెలాయిస్తారు. ఆకస్మిక ధనలాభం, వృత్తి, వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. చాలా ఉపశమనం పొందుతారు. ఈ నెల ప్రేమ, వైవాహిక జీవితానికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంలో ఎలాంటి సమస్యలు కనిపించవు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)