Horoscope Today: ఈ రాశివారి ఆదాయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి బాగా ఒత్తిడికి గురవుతారు. ఆదాయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఖర్చులు తగ్గించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఊహించని విధంగా అదృష్ట యోగం పడుతుంది. చిన్నాచితకా ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. ఆస్తి పంపకాల సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వృత్తిలో విజయం సాధిస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఖర్చులకు కళ్లెం వేస్తారు. పొదుపు పాటిస్తారు. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగంలో ఊహించని విధంగా పురోగతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. కొందరు సమీప బంధువులకు సహాయం చేస్తారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
అవసరాలకు తగ్గ డబ్బు అందుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగ పరంగా ప్రయోజనాలు పొందుతారు. ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. భాగస్వాములతో వివాదాలు సమసిపోతాయి. ముఖ్యమైన పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. ఆరోగ్యం పర్వాలేదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఒక మంచి కంపెనీలో ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరంగా ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. అధికారులకు మీ సలహాలు సూచనలు నచ్చుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వేగంగా వాహనాలు నడపటం మంచిది కాదు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండక పోవచ్చు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించే అవకాశం లేదు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పర్వాలేదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి ఆదాయ లాభం కనిపిస్తోంది. ఐటీ నిపుణులు, ప్రభుత్వ ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గం వల్ల ఉపయోగం కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారులు లాభాలను సంపాదిస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఒక విదేశీ కంపెనీ నుంచి మంచి ఆఫర్ వస్తుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా మారుతుంది. మిత్రులకు అండగా నిలబడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో లక్ష్యాలను తేలికగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. డబ్బు జాగ్రత్త.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
తొందరపాటు నిర్ణయాలకు, ఆవేశ కావేశాలకు ఇది సమయం కాదు. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగం విషయంలో ఒక శుభవార్త అందుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
సంపాదన పెరిగి ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రులకు మీ వల్ల మేలు జరుగుతుంది. ఊహించని విధంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ అందుకు తగ్గ ప్రతిఫలం పొందుతారు. అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థికపరంగా కొద్దిగా లబ్ధి పొందే సూచనలు ఉన్నాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కొందరు బంధువులు అపనిందలు వేసే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. మంచి చోట పెళ్లి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి బాగా ఒత్తిడికి గురవుతారు. ఆదాయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఖర్చులు తగ్గించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆస్తికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. స్థానచలనానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆధ్యాత్మిక చింతన బలపడుతుంది. కొందరు బంధువులతో కలిసి విందులో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సానుకూలపడుతుంది. అదనపు ఆదాయ మార్గం కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా శుభవార్త వింటారు. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకుంటారు. బంధువులతో అపార్ధాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. తోబుట్టువులతో ఆస్తి సమస్య ఒక కొలిక్కి వస్తుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.