Horoscope Today: ఈ రాశివారికి ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి.. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు.. శుక్రవారం రాశిఫలాలు..

| Edited By: Ravi Kiran

Feb 18, 2023 | 2:34 PM

కొందరు సన్నిహితులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా సానుకూలంగా మారుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

Horoscope Today: ఈ రాశివారికి ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి.. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు.. శుక్రవారం రాశిఫలాలు..
Horoscope
Follow us on

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. కొందరు సన్నిహితులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా సానుకూలంగా మారుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది కానీ కుటుంబ జీవితంలో కొన్ని చికాకులు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఆర్థిక సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. అదనపు ఆదాయం కోసం ఎక్కువగా శ్రమ పడటం జరుగుతుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. బాగా దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

ఇవి కూడా చదవండి

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ పరంగా పురోగతి ఉంటుంది. అయితే, ఇంటి వ్యవహారాలలోనూ, కొన్ని వ్యక్తిగత విషయాల్లోనూ బాగా ఒత్తిడి ఉంటుంది. మంచి చోట పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. కొందరు సన్నిహితులు, ముఖ్యమైన స్నేహితులు బాగా సహాయం చేస్తారు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థికంగా చిన్న చిన్న సమస్యలు తప్పకపోవచ్చు. అయితే, మీకు డబ్బు ఇవ్వాల్సిన వారు తీసుకువచ్చి ఇవ్వడంతో కొన్ని అవసరాలు తీరుతాయి. బంధువులకు, మిత్రులకు ఆర్థికపరంగా వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వడం ప్రస్తుతానికి మంచిది కాదు. మనసులోని ఒక చిన్న కోరిక అనుకోకుండా నెరవేరుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో అభివృద్ధి కనిపిస్తుంది. దాంపత్యంలో అన్యోన్యత పెరగటానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. కుటుంబ పెద్దల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ఆలోచన చేస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్, ఐటీ, స్వయం ఉపాధి రంగాల వారికి సమయం ఎంతగానో అనుకూలంగా ఉంది. ఈ అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో కొత్త ఆలోచనలతో అధికారులను మెప్పిస్తారు. మీ చొరవ కారణంగా కుటుంబంలో ఒకటి రెండు ఆస్తి సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. డబ్బు జాగ్రత్త.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ రోజు మంచి, చెడుల మిశ్రమంగా ఉంటుంది. కుటుంబ పరంగా, ఆర్థికపరంగా కొద్దిగా బాగానే ఉంటుంది కానీ ఉద్యోగంలో అధికారుల నుంచి కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుతానికి ఆచితూచి వ్యవహరించడం మంచిది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులు ఒక చిన్నపాటి ఉద్యోగంలో చేరే సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక రోగులకు కాస్తంత ఉపశమనం లభిస్తుంది. ఎవరికీ డబ్బు బాధ్యత అప్పగించ వద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఎన్ని సమస్యలు, ఆటంకాలు ఎదురైనప్పటికీ లక్ష్యసాధనకు బాగా కృషి చేస్తారు. ఉద్యోగం మారాలన్న మీ ప్రయత్నం నెరవేరుతుంది. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో ఉన్నతాధికారులకు మీ సలహాలు, సూచనలు నచ్చుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చుల కారణంగా టెన్షన్లకు గురవుతారు. మిత్రుల నుంచి ఊరడింపు మాటలు వింటారు. బాగా దగ్గర బంధువులు ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగం లోను, కుటుంబంలోనూ పని భారం పెరిగి మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఒక అతి ముఖ్యమైన కుటుంబ సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది. బంధు వర్గం నుంచి సహకారం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల వల్ల డబ్బు నష్టపోతారు. సొంత ఆలోచనలను నమ్ముకోవడం చాలా మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. తనకు మాలిన ధర్మంగా ఇతరులకు సహాయం చేస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరినైనా గుడ్డిగా నమ్మటం మంచిది కాదు. డబ్బు నష్టపోవడానికి అవకాశం ఉంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి.