Life Partner Astrology: వారికి జీవిత భాగస్వామితో అపార్ధాలు, అభిప్రాయ భేదాలు.. మీ దాంపత్య జీవితం ఎలా ఉంటుందంటే..?

| Edited By: Janardhan Veluru

Jun 17, 2023 | 5:55 PM

సాధారణంగా జాతక చక్రంలో ఏడవ స్థానాన్ని బట్టి జీవిత భాగస్వామి గురించి చెప్పవలసి ఉంటుంది. సప్తమ స్థానం, సప్తమ స్థానాధిపతి, శుక్ర గ్రహం జీవిత భాగస్వామిని సూచిస్తాయి. ప్రస్తుత గ్రహచారం ప్రకారం, సప్తమ స్థానంలో సంచరిస్తున్న గ్రహం ప్రకారం ఆ స్థానానికి సంబంధించిన అధిపతి ప్రకారం వివిధ రాశుల వారికి జీవిత భాగస్వామిని గురించిన వివరాలను తెలియజేయడం జరుగుతుంది.

Life Partner Astrology: వారికి జీవిత భాగస్వామితో అపార్ధాలు, అభిప్రాయ భేదాలు.. మీ దాంపత్య జీవితం ఎలా ఉంటుందంటే..?
Astrology
Follow us on

Life Partner Astrology: సాధారణంగా జాతక చక్రంలో ఏడవ స్థానాన్ని బట్టి జీవిత భాగస్వామి గురించి చెప్పవలసి ఉంటుంది. సప్తమ స్థానం, సప్తమ స్థానాధిపతి, శుక్ర గ్రహం జీవిత భాగస్వామిని సూచిస్తాయి. ప్రస్తుత గ్రహచారం ప్రకారం, సప్తమ స్థానంలో సంచరిస్తున్న గ్రహం ప్రకారం ఆ స్థానానికి సంబంధించిన అధిపతి ప్రకారం వివిధ రాశుల వారికి జీవిత భాగస్వామిని గురించిన వివరాలను తెలియజేయడం జరుగుతుంది.

  1. మేష రాశి: ఈ రాశికి సప్తమ స్థానంలో, అంటే తులా రాశిలో, కేతు గ్రహం సంచరి స్తోంది. ఈ గ్రహం అక్టోబర్ 24 వరకు ఈ రాశి లోనే సంచరించడం జరుగు తుంది. సాధారణంగా సప్తమ స్థానంలో కేతువు సంచారం జరుగుతున్న ప్పుడు జీవిత భాగ స్వామి ఆదిపత్య ధోరణి ప్రదర్శించడం, గయ్యాళితనంతో వ్యవహరించడం, తరచూ అపార్ధాలు చేసుకోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటక రాశిలో కుజ గ్రహంతో కలసి ఉన్నందు వల్ల కోపతాపాలు కొద్దిగా ఎక్కువగానే కనిపించే అవకాశం ఉంది. అందువల్ల ప్రస్తుతానికి ఎంత తగ్గి ఉంటే అంత మంచిది.
  2. వృషభ రాశి: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో గ్రహమేది లేనప్పటికీ సప్తమ స్థానాధిపతి అయినా కుజుడు కర్కాటకంలో నీచ స్థానంలో ఉన్నందువల్ల జీవిత భాగస్వామి అనారోగ్యంతో ఇబ్బందిపడే అవకాశం ఉంది. లేదా జీవిత భాగస్వామికి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామిని వదిలిపెట్టి తరచూ ప్రయాణాలు చేయడం జరుగుతుంది. చిన్న చిన్న కలహాలు తప్పకపోవచ్చు. జీవిత భాగస్వామి తరఫు బంధువుల ద్వారా అపార్ధాలు తలెత్తే సూచనలు కూడా ఉన్నాయి. ఏవైనా చిరాకులు తలెత్తినప్పుడు రాజీమార్గం అనుసరించడం మంచిది.
  3. మిథున రాశి: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో గ్రహం లేనప్ప టికీ, సప్తమాధిపతి అయిన గురువు11వ స్థానంలో మేష రాశిలో సంచరిస్తున్నందువల్ల, జీవిత భాగస్వామి తన ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ ఆదాయపరంగా లేదా పదవీపరంగా పురోగతి సాధించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి లేదా సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా జీవిత భాగస్వామికి ముక్కు మీద కోపం ఉండే సూచనలు ఉన్నాయి. స్వేచ్ఛ కోసం పోరాడే తత్వం ఉంటుంది. అందువల్ల జీవిత భాగ స్వామితో వీలైనంత స్నేహంగా, సామరస్యంగా వ్యవహరించడం మంచిది.
  4. కర్కాటక రాశి: ఈ రాశికి సప్తమ స్థానంలో ఏ గ్రహమూ సంచరించడం లేదు. అయితే సప్తమ స్థానానికి అధిపతి అయిన శనీశ్వరుడు అష్టమంలో, అంటే కుంభ రాశిలో, తన స్వస్థానంలో ఉన్నందువల్ల జీవిత భాగస్వామితో కొద్దిగా ఎడబాటు తప్పక పోవచ్చు. ప్రయాణాలు చేయవలసి రావటం, ఉద్యోగరీత్యా దూర ప్రాంతంలో ఉండవలసి రావటం వంటివి చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే అన్యోన్యతకు మాత్రం ఎటువంటి భంగమూ ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగాల రీత్యా జీవిత భాగస్వామి పురోగతి చెందడం లేదా తీరికలేని పరిస్థితి ఏర్పడటం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి: ఈ రాశికి సప్తమ స్థానంలో అంటే కుంభ రాశిలో సప్తమ స్థానాధిపతి సంచరిస్తున్నందువల్ల, జీవిత భాగస్వామి ఆర్థికంగా పురోగతి చెందటం ఉద్యోగంలో పైకి రావడం జీవితంలో స్థిరత్వం ఏర్పడటం వంటివి జరిగే అవకాశం ఉంది. ఇక్కడ శనీశ్వరుడు 2025 జూలై వరకు సంచరిస్తున్నందు వల్ల జీవిత భాగస్వామికి ఒక విధంగా అదృష్టం పట్టే అవకాశం కూడా ఉంది. అంతేకాక, ఆధ్యాత్మిక చింతన పెరగటం, ఆలయాలు సందర్శించడం, తీర్థయాత్రలకు వెళ్ళటం, మొక్కులు చెల్లించుకోవడం వంటివి కూడా జరిగే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి ఈ రాశి వారి కంటే ఎక్కువగా పురోగతి సాధించడం జరుగుతుంది.
  7. కన్యా రాశి: ఈ రాశికి సప్తమ స్థానంలో గ్రహాలేవీ సంచరించడం లేదు కానీ, సప్తమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో అంటే మేషరాశిలో రాహువుతో కలిసి ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య కొద్దిగా అపార్ధాలు, అభిప్రాయ భేదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. సాధారణంగా వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఇటువంటివి కొనసాగే సూచనలు ఉన్నాయి. వియోగం, ఎడబాటు వంటివి సంభవించే అవకాశం కూడా ఉంది. సర్దుకుపోలేని పక్షంలో శాశ్వతంగా ఒకరికొకరు దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈగో సమస్యలు తగ్గించుకొని సామరస్యంగా ఉండటానికి గట్టి ప్రయత్నం చేయవలసి ఉంటుంది.
  8. తులా రాశి: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో గురు రాహులు సంచరించడం, సప్తమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో నీచపడి ఉండటం వల్ల, జీవిత భాగస్వామితో ఒక రోజు బాగుంటే మరో రోజు బావుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకరినొకరు నిర్లక్ష్యం చేసుకోవడం, దూరం పెట్టడం వంటివి జరిగే సూచనలు కూడా ఉన్నాయి. అయితే జీవిత భాగస్వామి వృత్తి ఉద్యోగాలపరంగా బాగా బిజీ అయిపోయే అవకాశం కూడా ఉంది. వివాహ బంధానికి ఎటువంటి లోటు లేదు కానీ కొద్దిగా కమ్యూనికేషన్ లోపం తలెత్తే సూచనలున్నాయి. అన్యోన్యత పెరగడానికి ప్రత్యేకంగా కృషి చేయవలసి ఉంటుంది.
  9. వృశ్చిక రాశి: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో బుధ గ్రహం సంచరించడం సప్తమ స్థానాధిపతి కర్కాటకంలో కుజ గ్రహంతో కలిసి ఉండటం వల్ల జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి అదృష్టం పట్టడం, ఆర్థికంగా కలిసి రావడం, ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎదగడం, మంచి గుర్తింపు రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో జీవిత భాగస్వామిని ఎంత ప్రోత్సహిస్తే అంత మంచిది. భార్యాభర్తల మధ్య సుఖసంతోషాలకు లోటు ఉండకపోవచ్చు. అయితే జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం.
  10. ధనూ రాశి: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో అంటే మిధున రాశిలో రవి సంచారం వల్ల జీవిత భాగస్వామికి ఆర్థికంగా కలిసి రావడం, గుర్తింపు లభించడం, ప్రమోషన్ రావటం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి. అంతేకాక క్షణం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు వంటి వృత్తి నిపుణులకు సంపాదన పెరగటం డిమాండ్ పెరగటం వంటివి జరగవచ్చు. అయితే దంపతుల మధ్య తరచూ కీచులాటలు జరిగే అవకాశం కూడా ఉంది. భార్య భర్తల మధ్య ఇతరులు తలదూర్చకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆహార విహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది.
  11. మకర రాశి: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో అంటే కర్కాటక రాశిలో కుజ శుక్ర గ్రహాల సంచారం జరుగుతున్నందు వల్ల భార్యాభర్తల మధ్య అవగాహన, సామరస్యం, అన్యోన్యత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వృత్తి ఉద్యోగాల పరంగా ఒత్తిడి ఎక్కువ కావడం, ప్రయాణాలు చేయవలసి రావటం, బాధ్యతలు పెరగటం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. విహార యాత్రలు, వినోద యాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. జీవిత భాగస్వామి ఉద్యోగపరంగా ఎదగటానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించవలసి వస్తుంది.
  12. కుంభ రాశి: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో గ్రహాలు ఏవీ లేనప్పటికీ సప్తమాధిపతి అయిన రవి పంచమ స్థానమైన మిధున రాశిలో సంచారం చేస్తున్నందు వల్ల, జీవిత భాగస్వామి పట్ల ఇదివరకు ఎన్నడూ లేనంతగా ప్రేమ పెరిగే అవకాశం ఉంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వీరి మధ్య ఇదివరకు ఏవైనా సమస్యలున్న పక్షంలో అవి వాటంతటవే తొలగిపోవడం జరుగుతుంది. జీవిత భాగస్వామి వల్ల అదృష్టం కలిసి రావడం ఉద్యోగంలో పైకి ఎదగటం ఆదాయం పెరగటం సంతానం అభివృద్ధి చెందటం వంటివి జరగవచ్చు. కుటుంబ పరంగా జీవిత భాగస్వామి ఎక్కువగా బాధ్యతలు పంచుకునే సూచనలు ఉన్నాయి.
  13. మీన రాశి: మీన రాశికి సప్తమ స్థానంలో గ్రహాలేవీ లేనప్పటికీ సప్తమ స్థానాధిపతి అయిన బుధుడు వృషభ రాశిలో సంచరిస్తున్నందువల్ల దాంపత్య జీవితం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి మంచి అదృష్టం పడుతుంది. ఆకస్మిక ధన లాభానికి లేదా ధన యోగానికి అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి తరఫు బంధువుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు సిద్ధించడానికి కూడా అవకాశం ఉంది.

నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..