సింహ రాశిలో సంచరిస్తున్న రవి గ్రహం.. ఆ ఆరు రాశుల వారికి ఐశ్వర్యం, అధికారం!

నిజానికి రవి గ్రహం ఒక మిస్టరీ గ్రహం. గ్రహ రాజైనందువల్ల రవి అధీనంలో అనేక అంశాలు (శాఖలు) ఉంటాయి. రాజకీయాలు, ప్రభుత్వం, ఉన్నతాధికారులు, ఐశ్వర్యం, రియల్ ఎస్టేట్ ఇందులో ముఖ్యమైనవి. శాఖ ఏదైనప్పటికీ, హుందాతనానికి మారుపేరు రవి గ్రహం. ఈ రవి గ్రహం ప్రస్తుతం తన స్వక్షేత్రమైన సింహరాశిలో సంచరిస్తున్నాడు.

సింహ రాశిలో సంచరిస్తున్న రవి గ్రహం.. ఆ ఆరు రాశుల వారికి ఐశ్వర్యం, అధికారం!
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 11, 2023 | 5:57 PM

Surya Graha in Leo: గ్రహాలన్నిటికీ రాజైన రవి గ్రహం ఎప్పుడు ఏ రాశి మీద అనుగ్రహాన్ని వర్షింపజేస్తాడో, ఎవరిని ఏఏ విధంగా అందలాలు ఎక్కిస్తాడో ఒక పట్టాన చెప్పడం కష్టం. నిజానికి రవి గ్రహం ఒక మిస్టరీ గ్రహం. గ్రహ రాజైనందువల్ల రవి అధీనంలో అనేక అంశాలు (శాఖలు) ఉంటాయి. రాజకీయాలు, ప్రభుత్వం, ఉన్నతాధికారులు, ఐశ్వర్యం, రియల్ ఎస్టేట్ ఇందులో ముఖ్యమైనవి. శాఖ ఏదైనప్పటికీ, హుందాతనానికి మారుపేరు రవి గ్రహం. ఈ రవి గ్రహం ప్రస్తుతం తన స్వక్షేత్రమైన సింహరాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 16న తన మిత్రక్షేత్రమైన మిథునంలో ప్రవేశించినప్పటి నుంచి అక్టోబర్ 17న తనకు మరో మిత్రక్షేత్రమైన కన్యారాశి నుంచి నిష్క్రమించే వరకూ ఆరు రాశులను ఏదో ఒక రూపంలో అనుగ్రహిస్తూనే ఉన్నాడు. మిథునం తర్వాత చంద్ర క్షేత్రమైనన కర్కాటక రాశి కూడా రవికి మిత్ర క్షేత్రమే. మేషం, వృషభం, కర్కాటకం, సింహం. వృశ్చికం, ధనూ రాశులకు అత్యంత శుభ గ్రహమైన రవి ఇప్పటి నుంచి అక్టోబర్ 17 వరకూ మరింత శక్తిమంతంగా వ్యవహరిస్తూ శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశికి పంచమాధిపతి అయిన రవి ప్రస్తుతం పంచమ స్థానంలోనే సంచరించడం వల్ల రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, రాజకీయాలో ప్రవేశించడం, అధికారం చేపట్టడం, ప్రభుత్వ పోటీ పరీక్షల్లో విజయాలు సాధించడం, ప్రభుత్వంలో అత్యున్నత స్థానానికి ఎదగడం, సత్సంతానం కలగడం, నిస్సంతులు సైతం గర్భం ధరించడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రవి ఐశ్వర్య కారకుడు కూడా అయినందువల్ల ఏదో ఒక రూపంలో సంపద పెరగడం జరుగుతుంది.
  2. వృషభం: ఈ రాశికి చతుర్ధాధిపతి అయిన రవి తన స్వక్షేత్రంలో ఉండడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. దంపతులు మధ్య పొరపచ్చాలు ఏమైనా ఉంటే మటుమాయం అవుతాయి. గృహ, వాహన సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. తల్లి వైపు నుంచి సహాయ సహ కారాలు లభించడం గానీ, ఆస్తి కలిసి రావడం గానీ జరుగుతుంది. భూమికి సంబంధించిన ఏ లావాదేవీ అయినా, ఏ వ్యాపారమైనా తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి రవి ధనాధిపతి, కుటుంబ స్థానాధిపతి అయినందువల్ల, తప్పకుండా సంపద కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా అనుకూల ఫలితా లనిస్తుంది. కుటుంబ వృద్ధి ఉంటుంది. పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది. ఈ రాశివారి మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఈ రాశివారి సలహాలు, సూచనల వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి సాధ్యమవుతుంది. రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారాలు పుంజుకుంటాయి.
  4. సింహం: ఈ రాశి నాథుడైన రవి గ్రహం ఈ రాశిలోనే సంచరించడం, ఈ నెల 17 తర్వాత ధన స్థానంలో ప్రవే శించడం వల్ల ఈ రాశివారు సమాజంలో సింహంలా బతికే అవకాశం ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో, రాజకీయ ప్రముఖులతో, ఉన్నతాధికారులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆర్థికంగా ఉన్నత స్థితి లభిస్తుంది. కుటుంబ సంపద పెరుగుతుంది. వీరి మాటకు విలువ ఏర్పడుతుంది. గుండె ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తాయి.
  5. వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతి అయిన రవి దశమ స్థానంలోనే ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. రాజ కీయంగా ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతుంది. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. నిరుద్యోగులు ఆశించిన దాని కంటే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మార దలచుకున్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
  6. ధనుస్సు: ఈ రాశివారికి రవి భాగ్యస్థానాధిపతి అయి ఉండి, భాగ్య స్థానంలోనే ఉన్నందువల్ల ఆర్థికంగా మంచి అదృష్టం పడుతుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా సఫలం అవుతుంది. చదువులు, ఉద్యోగాలపరంగా విదేశీ అవకాశాలు అందివస్తాయి. ప్రముఖులైన వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ప్రభుత్వానికి దగ్గరవుతారు. సంతాన యోగం పడుతుంది. అనేక ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!