Lord Shani: ఈ నెలలో ఈ రాశులకు ఏలి నాటి శని, శని దోషం నుంచి విముక్తి.. వీరు పట్టిందల్లా బంగారమే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి, ప్రతి రాశికి, నక్షత్రానికి, ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాయి. అదే విధంగా ఏప్రిల్ నెలలో కూడా కొన్ని గ్రహాలు సంచారం చ్సేతున్నాయి. ఈ సంచారం వలన ఈ నెల చాలా ప్రత్యేకమైన మాసంగా చెప్పబడింది. ఈ నెలలో గ్రహాలు రారాజు సూర్యుడు మీన రాశి నుంచి మేష రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. అంతేకాదు గ్రహాలకు అధిపతి భూమి పుత్రుడు అంగారకుడు మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదే సమయంలో శనీశ్వరుడు నక్షత్రాన్ని మర్చుకోనున్నాడు. దీంతో కొన్ని రాశులకు శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందట.

Lord Shani: ఈ నెలలో ఈ రాశులకు ఏలి నాటి శని, శని దోషం నుంచి విముక్తి.. వీరు పట్టిందల్లా బంగారమే..
Shani Dosha Relief

Updated on: Apr 07, 2025 | 2:55 PM

ఇప్పటికే కర్మ ప్రధాత, న్యాయాధి పతి శనీశ్వరుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి అడుగు పెట్టాడు. మీన రాశిలో ఉన్న శనీశ్వరుడు సూర్యుడు, శుక్రుడు బుధుడు రాహువులతో సంయోగం చెందనున్నాడు. ఈ గ్రహాల సంయోగం మొత్తం 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. దీంతో ఈ నెలలో కొన్ని రాశులకు శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రోజు శని దోషం ననుంచి బయటపడే రాశులు ఏమిటో తెలుసుకుందాం..

వృశ్చిక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఏప్రిల్ లో గ్రహాల సంయోగం వలన శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు శనీశ్వరుడు కారణంగా వచ్చే శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. దీంతో ఈ నెల నుంచి వీరికి అన్నింటా అదృష్టమే. వీరికి శుభ ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా వర్తక, వ్యాపారస్తులకు తమ పెట్టుబడుల విషయంలో అనేక ప్రయోజనాలు పొందుతారు. శని దోషం వలన వీరు గత కొన్నేళ్లుగా పడుతున్న కష్టాలకు, ఇబ్బందులకు ఏప్రిల్ నెల నుంచి విముక్తి లభిస్తుంది. వీరు ఆర్ధికంగా అనేక ప్రయోజానాలు పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

మీన రాశి: ఈ రాశి వేదికగా అనేక గ్రహాల కలయిక జరగనుంది. శనీశ్వరుడు సంచారంతో ఈ రాశికి చెందిన వ్యక్తులకు కలిసి వస్తుంది. వీరు పట్టిందల్లా బంగారమే. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వీరికి ఏలి నాటి శనిదోషం తొలగిపోతుంది. అన్ని విధాలుగా ఆదాయం లభిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు లాభాలను పొందుతారు. ఏ పని చేసినా సక్సెస్ వీరి సొంతం. ఉద్యోగప్రయత్నాలు ఫలిస్తాయి. శనిదోషం నుంచి బయట పడడంతో వీరు ఎంతో సంతోషంగా జీవిస్తారు.

ఇవి కూడా చదవండి

మకర రాశి: ఈ రాశికి చెందిన వారు కూడా ఏప్రిల్ నెలలో శని దోషం నుంచి బయటపడతారు. దీంతో వీఎరు అనేక ప్రయోజనాలు పొందుతారు. ఏలి నాటి శని నుంచి వీరికి ఉపశమనం లభించడంతో ఆర్ధికంగా లాభాలను పొందుతారు. ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏ పని చేసిన సానుకూల ఫలితాలే వస్తాయి. అదృష్టం వీరి సొంతం. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. ఇక నుంచి మకర రాశి వారికి సిరి సంపదలకు లోటు ఉండదు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు