ధర్మవరం మున్సిపాలిటీలో ఒక్క ఓటుతో వైసీపీ అభ్యర్థి విజయం.. రీకౌంటింగ్‌లో చేయగా..
ధర్మవరం మున్సిపాలిటీ 1వ వార్డులో వైసీపీ అభ్యర్థి చెలిమి రామకృష్ణమ్మ ఒక్క ఓటు మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసినా ఫలితంలో మార్పు రాలేదు. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి .. .. ..

ధర్మవరం మున్సిపాలిటీలోని 1వ వార్డు ఎన్నికల ఫలితం తీవ్ర ఉత్కంఠ మధ్య వెలువడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెలిమి రామకృష్ణమ్మ తన ప్రత్యర్థిపై కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో స్వల్ప తేడా ఉండటంతో బీజేపీ అభ్యర్థి సాకే లక్ష్మీదేవి ఫలితంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రీకౌంటింగ్ నిర్వహించాలని అధికారులను కోరారు. ఆమె రిక్వెస్ట్ మేరకు ఎన్నికల అధికారులు మరోసారి ఓట్లను లెక్కించారు. అయితే, రీకౌంటింగ్‌లోనూ ఫలితంలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. వైసీపీ అభ్యర్థి రామకృష్ణమ్మ ఒక్క ఓటు ఆధిక్యంతో గెలిచినట్లు అధికారులు మరోసారి నిర్ధారించి అధికారికంగా ప్రకటించారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. వైసీపీ శ్రేణులు విజయోత్సాహంతో సంబరాలు చేసుకున్నాయి.
పెనుకొండ మున్సిపాలిటీ కూటమి కైవసం
ఇదిలా ఉండగా, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మున్సిపాలిటీలో కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 23 వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 21 స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన, బీజేపీ అభ్యర్థులు ఒక్కో వార్డులో విజయం సాధించారు. దీంతో పెనుకొండ మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగురవేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. చాలా చోట్ల కూటమి తన ఆధిక్యతను ప్రదర్శిస్తుంది.
