
అమరావతి, ఫిబ్రవరి 02: వైఎస్ఆర్సీపీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఆరవ జాబితాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలు ఎన్నికల రణరంగంలో గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైఎస్ఆర్సీపీ తన అభ్యర్థులను విడతల వారీగా ప్రకటించుకుంటూ ముందుకుసాగుతోంది. వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆరో జాబితా విడుదల చేశారు మంత్రి మేరుగ నాగార్జున. నాలుగు ఎంపీ, ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు.
రాజమండ్రి నుంచి గూడూరి శ్రీనివాస్, నర్సాపురం గూడూరి ఉమాబాల, గుంటూరు ఉమ్మారెడ్డి రమణ, చిత్తూరు ఎంపీ స్థానంలో రెడ్డప్పను ఇన్‌చార్జ్‌గా ప్రకటించారు. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే.. గిద్దలూరు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌గా నాగార్జునరెడ్డి, ఎమ్మిగనూరు బుట్టా రేణుక, జీడీ నెల్లూరు నారాయణస్వామి, మైలవరం నుంచి తిరుపతిరావు, నెల్లూరు సిటీ నుండి ఎండీ ఖలీల్, మార్కాపురం అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌గా అన్నా రాంబాబుల పేర్లను ప్రకటించారు.
తొలి జాబితాలో 11 నియోజకవర్గాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు, మూడో జాబితాలో 21 నియోజకవర్గాలకు, నాలుగో జాబితాలో ఎనిమిది స్థానాలను, ఐదవ జాబితాలో నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను మారుస్తూ వారి పేర్లను ప్రకటించింది. ఆరవ జాబితాలో మోత్తం 10 మంది సమన్వయకర్తలను ప్రకటించింది వైఎస్సార్‌సీపీ. ఇప్పటి వరకు ఐదు జాబితాల వారీగా 67 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాలకు, 18 పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జిలను ప్రకటించింది వైసీపీ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..