MP Vijayasai Reddy: విజయసాయిరెడ్డి 2.0 వెర్షన్.. ట్వీటారంటే పాలిటిక్స్ షేక్ అవ్వాల్సిందే.. అంత మాట అనేశారేంటి..

YSRCP MP Vijayasai Reddy : ఆయన రూటే సపరేటు.. అందరికీ భిన్నంగా ఆయన ట్వీటుతారు.. అదేనండీ ట్విట్ చేస్తారు. మిగతా రాజకీయ నేతలతో పోలిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. రాష్ట్రంలో చోటు చేసుకునే ప్రధానమైన రాజకీయ అంశాల పట్ల విజయసాయి రెడ్డి చేసే..

MP Vijayasai Reddy: విజయసాయిరెడ్డి 2.0 వెర్షన్.. ట్వీటారంటే పాలిటిక్స్ షేక్ అవ్వాల్సిందే.. అంత మాట అనేశారేంటి..
Vijayasai Reddy

Edited By:

Updated on: Jul 29, 2023 | 12:14 PM

YSRCP MP Vijayasai Reddy : ఆయన రూటే సపరేటు.. అందరికీ భిన్నంగా ఆయన ట్వీటుతారు.. అదేనండీ ట్విట్ చేస్తారు. మిగతా రాజకీయ నేతలతో పోలిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. రాష్ట్రంలో చోటు చేసుకునే ప్రధానమైన రాజకీయ అంశాల పట్ల విజయసాయి రెడ్డి చేసే ట్వీట్లపై విస్తృతమైన చర్చ జరుగుతుంటుంది. అయితే విజయ్ సాయి రెడ్డి ట్వీట్ల మొదటి వెర్షన్ 1.0 లో ప్రతిపక్ష పార్టీలపై ప్రత్యర్థి పార్టీల నేతలపై ఆయన నేరుగా పరుషమైన, తీవ్ర పదజాలంతో విరుచుకుపడేవారు. కొన్ని సందర్భాల్లో ఆ ట్వీట్లని చదివేందుకు కూడా ఇబ్బందిగా ఉంది.. అంటూ విమర్శలు వచ్చినా సరే.. ప్రత్యర్థి పార్టీల యాక్షన్ ను బట్టి రియాక్షన్ ఉంటుందని, అవతలి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గాంధేయవాదంలో సమాధానం ఇచ్చే రోజులు కావనీ సాయి రెడ్డి చెప్పేవారట. పార్టీ కూడా ఒక్కరైనా ఆ స్థాయిలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని భావించేదట. ఆ తర్వాత కాలంలో సోషల్ మీడియా బాధ్యతల్ని ఆయన చూడడం మానేశాక వీటిపై అంత ఫోకస్ చేయలేదట సాయి రెడ్డి. దానికి తోడు పార్టీ సంస్థాగత అంశాలు, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన సంప్రదింపులు లాంటి వ్యవహారాల నేపథ్యంలో బిజీ అయిపోయి చాలా రోజులపాటు ఆయన ట్వీట్లు పెట్టడం కూడా మానేశారట. దాంతో మళ్లీ విజయసారెడ్డి ట్వీట్లు పెడితేనే బాగుంటుందన్న వాదన పార్టీ నుంచే ప్రారంభమైందట. పార్టీ అధిష్టానంలో కీలక నేత కాబట్టి ఆయన చేసే ట్వీట్లకి రాజకీయ ప్రాధాన్యత ఉంటుందని, కీలకమైన అంశాల పట్ల సునిశితంగా, నేరుగా చేసే విమర్శలు కాబట్టి అవి కొనసాగాలని పార్టీలో కూడా చర్చ జరిగిందట. దానీ ఫలితమో లేదంటే ఎన్నికలు, సమీపిస్తుండడం, మళ్ళీ రాష్ట్ర రాజకీయాలపై ఆయన ఫోకస్ పెరగడమో.. తెలియదు కానీ, మళ్ళీ విజయసాయిరెడ్డి ట్వీట్ల 2.0 వర్షన్ ప్రారంభమైంది

గతంకంటే భిన్నంగా.. ట్వీట్ల వెర్షన్..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి విశాఖ పర్యటనపై ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా చేసిన ఆసక్తికర ట్వీట్ చేశారు.. ” కొత్త అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఫ్లెక్సీలతో లేని హడావుడి చేసే బదులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనో, రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలనో పోరాడొచ్చుగా! ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉంటుంది. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేయడం ఎందుకు?” అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదీ కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న భారతీయ జనతా పార్టీకి చెందిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పై నేరుగా చేసిన రాజకీయ విమర్శ ఇది. చాలా పొదుపుగా ఇందులో పదాలు వాడినా చాలా పదునైన విమర్శనే ఇది. మాజీ కేంద్రమంత్రిగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, సీనియర్ లీడర్ గా కొనసాగుతున్న పురంధేశ్వరి సాధారణంగా తనపై రాజకీయ వచ్చే విమర్శలను సీరియస్ గానే తీసుకుంటారు. అందులోనూ విజయసాయి రెడ్డి లాంటి ప్రధానమైన నేతలు చేసే ఇలాంటి విమర్శలకు చాలా రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది. అందులోనూ విజయసాయి రెడ్డి విమర్శలను ఆయన వ్యక్తిగత విమర్శలుగా కూడా చూడలేం. నేరుగా పార్టీ అభిప్రాయంగానే చుడాల్సి ఉంటుంది.

ఈ ట్వీట్ లో ఆయన విమర్శలపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీ ప్రధానంగా ఎదుర్కొనే విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ ఫ్లెక్సీలకు ఇచ్చే ప్రాధాన్యత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనో, రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలన్న వాటికి ఇవ్వొచ్చుగా! అంటూ నేరుగా చేసిన విమర్శలకు పురంధరేశ్వరి ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే..

లోకేష్ – యువగళం పైనా ట్వీట్

ఇక నిన్న లోకేష్ – యువగళంపైనా ఎంపీ విజయ సాయి రెడ్డి చేసిన ట్వీట్ కూడా రాజకీయంగా చర్చకు దారితీసింది. “యువగళంకి స్పందన కరువై, ఎవరూ గాలానికి చిక్కడం లేదనా.. యాంకర్ గళాన్ని జోడించాడు లోకేష్! ఎన్నిపగటి కలలుకన్నా, డ్రామాలు వేసినా ప్రయోజనం లేదు బాబూ.” అంటూ ఒక రాజకీయ కార్యక్రమాలలో యాంకర్ ను వినియోగించడం అంటే ఆ కార్యక్రమాలకు స్పందన కోసమే, ప్రస్తుతం దానికి స్పందన లేకనే ఉదయభానును తీసుకొచ్చారా..? అంటూ చాలా సునిశితమైన విమర్శనే ఆయన చేశారు. గతంలో లోకేష్ పై చేసిన ట్వీట్ కూ, ఈ ట్వీట్ కు చాలా తేడా ఉంది. అదే తీవ్రత ఉన్నప్పటికీ పదాల వినియోగం చాలా పొదుపుగా ఉండడంపైనా ఆసక్తికర చర్చనే నడుస్తోంది. అలా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శలపైనా ఆయన ట్వీట్లు ప్రారంభించారు. ఇలా రాష్ట్రంలో ప్రజల మూడ్ ను ప్రభావితం చేసే రాజకీయ అంశాల పట్ల మళ్లీ విజయసాయి రెడ్డి ట్వీట్ల ను ప్రారంభించడంపై ఏపీ రాజకీయాల్లో రసవత్తరమైన చర్చే జరుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..