- Telugu News Photo Gallery Viral photos vizianagaram traffic police found 93 pending challans on bike Telugu News
Vizianagaram: తనిఖీల్లో భాగంగా బైక్ ఆపిన పోలీసులు.. చలానాలు చెక్ చేసి బిత్తరపోయారు..
ఆంధ్రాలో ట్రాఫిక్ పోలీసులు అలెర్టయ్యారు. రూల్స్ ఎవరూ అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు, అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడానికి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పౌరులను కోరుతున్నారు. ఈ క్రమంలోనే స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. ఎక్కడిక్కడ తనిఖీలు చేస్తూ ఉల్లంఘనలకు పాల్పడేవారి బెండు తీస్తున్నారు. తాజాగా విజయనగరంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.
Updated on: Jul 29, 2023 | 12:40 PM

విజయనగరంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ బైక్ ఆపి.. వారంతా స్టన్ అయ్యారు. అందుకు కారణం ఆ వాహనంపై ఉన్న చలాన్లే. 5, 10 కాదండోయ్.. ఏకంగా ఆ బైక్‌పై 93 చలానాలు ఉన్నాయి. ఆ వాహనం నంబర్ 7099, గ్లామర్ బైక్ అని వెల్లడించారు.

తొలుత బైక్ ఆపగానే డ్రైవింగ్ లైసెన్స్ , సీ బుక్, బైక్ ఇన్స్యూరెన్స్.. ఇలా అన్నీ చెక్ చేశారు. అలాగే బైక్‌పై ఉన్న ఫైన్స్ డేటా చెక్ చేయడంతో.., అసలు విషయం వెలుగుచూసింది.

అయితే ఈ ఫైన్స్ అన్నీ.. ఆటోమేటిక్ ఈ చలాన్ సిస్టమ్ ద్వారా పడినమే అని ట్రాఫిక్ పోలీసుల వివరించాడు. అయితే తాను వేరు వ్యక్తి నుంచి బైక్ కొన్నట్లు ఆ బైక్ నడిపిన వ్యక్తి చెబుతున్నాడు. జరిమానాలు గురించి తనకు తెలియదు అంటున్నాడు. కానీ పోలీసులు ఆ చలానాలు కట్టాల్సిందే అని స్పష్టం చేశారు.

బైక్ అమ్మినా.. ఆ చలానాలు కట్టేందుకు పైసలు సరిపోవని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తామేం చేయలేమని.. రూల్స్ ఫాలో అవ్వాల్సిందేనని పోలీసులు తేల్చి చెప్పారు. అతడు చలానాలు కట్టకపోవడంతో బండిని సీజ్ చేశారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. ఎవరైనా సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేస్తుంటే అన్ని బైక్ డాక్యుమెంట్స్‌తో పాటు పెండింగ్ చలానాలు కూడా తనిఖీ చేయాలని చెబుతున్నారు. వాటిని చూడకుండా వాహనం కొనుగోలు చేస్తే.. కొన్న వ్యక్తే ఆ చలానాలకు బాధ్యుడని చెబుతున్నారు. విజయనగరంలో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో పెండింగ్ ఈ చలనాలను చాలామందితో క్లియర్ చేయించారు. మొత్తం 163 మంది వాహనదారులు పాత ఈ చలానాలను చెల్లించినట్లు వివరించారు.





























