నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఛాలెంజ్‌లకు దారితీస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన మంత్రి పెద్దిరెడ్డి టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. పుంగనూరుకు మంత్రి ఏం చేశారని ఇటీవల నిలదీశారు లోకేష్. ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. దీనికి ఎంపీ మిధున్‌రెడ్డి తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. పుంగనూరు అభివృద్ధిపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు. లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు మిధున్‌రెడ్డి. ఇష్టం వచ్చినట్లు ఆయన మాట్లాడుతున్నారని, చిన్నాపెద్దా తేడా లేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తిట్టడం కోసమే లోకేష్ యాత్ర పెట్టుకున్నారన్నారు మిధున్‌రెడ్డి. ఇలానే మాట్లాడితే ప్రజల నుంచి గట్టిగానే రియాక్షన్ వస్తుందంటూ కౌంటర్ ఇచ్చారు.
జగన్ మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై విమర్శలు చేయడం కాదని.. అభివృద్ధిపై మాట్లాడాలని లోకేష్ కు సవాల్ చేశారు. తనపార్టీ మేనిఫెస్టోపై మాట్లాడకుండా అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. చిత్తూరు జిల్లా అభివృద్ధికి టీడీపీ ఏం చేసిందంటూ మిధున్ రెడ్డి నిలదీశారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి, చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం తమ పార్టీ అజెండాపై మాట్లాడకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు.
కాగా, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. దీంతో అటు అధికార పార్టీ వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..