Kodali Nani: పవన్‌ కల్యాణ్‌కు ఆ విషయం చెప్పాలనుకున్నా.. కానీ, కుదరలేదు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

Kodali Nani on Pawan Kalyan: రాజకీయంగా తమను ఎదుర్కొంటే పవన్ కళ్యాణ్ కు సమాధానమిస్తామని అన్నారు. ఎన్నికలు అయ్యేవరకు పవన్ ఎన్ని విడతల యాత్రలు చేసిన తమకు అభ్యంతరం లేదని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబుని కనీసం ప్రతిపక్ష నేతగానైనా చూడాలన్నదే పవన్ కళ్యాణ్ అంతిమ లక్ష్యం అని విమర్శించారు. మరోవైపు, పవన్ కళ్యాణ్ కు ఒక విషయం చెబుదామని ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరలేదని..

Kodali Nani: పవన్‌ కల్యాణ్‌కు ఆ విషయం చెప్పాలనుకున్నా.. కానీ, కుదరలేదు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..
Kodali Nani On Pawan Kalyan

Edited By:

Updated on: Aug 07, 2023 | 5:45 PM

అమరావతి, ఆగస్టు 7: మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ శాసనసభ్యులు కొడాలి నాని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా వ్యక్తిగత కారణాలతో మౌనంగా ఉంటున్న కొడాలి నాని.. తాజాగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ పేరు చెబితే ఒంటికాలితో లేచే కొడాలి నాని ఈ మధ్య విమర్శలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ పై, వారాహి యాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తమను ఎదుర్కొంటే పవన్ కళ్యాణ్ కు సమాధానమిస్తామని అన్నారు. ఎన్నికలు అయ్యేవరకు పవన్ ఎన్ని విడతల యాత్రలు చేసిన తమకు అభ్యంతరం లేదని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబుని కనీసం ప్రతిపక్ష నేతగానైనా చూడాలన్నదే పవన్ కళ్యాణ్ అంతిమ లక్ష్యం అని విమర్శించారు. మరోవైపు, పవన్ కళ్యాణ్ కు ఒక విషయం చెబుదామని ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరలేదని.. అందుకే మీడియా ద్వారా చెబుతున్నట్లు కొడాలి నాని వివరించారు.

పవన్ కళ్యాణ్‌కు కొడాలి నాని చెప్పాలనుకున్న విషయం ఏంటి?

అసలింతకీ పవన్ కళ్యాణ్ కు కొడాలి నాని ఏం చెప్పాలనుకున్నారో తెలుసా? చంద్రబాబు గురించే పవన్ కు చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నారట కొడాలి నాని. చంద్రబాబు రక్తంలోని ప్రతి అణువులో వెన్నుపోటు ఉందని.. ఇదే విషయాన్ని స్వయంగా పవన్ కు చెప్పేందుకు అనేకసార్లు ప్రయత్నించారట. అయినా కుదరకపోవడంతో మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానని కొడాలి నాని వ్యంగ్యంగా సెటైర్లు వేశారు. చంద్రబాబును గుడ్డిగా నమ్మితే పవన్ కళ్యాణ్ కూడా అధోగతి పాలవుతారని హితవు పలికారు. రాజకీయాల్లో వైసీపీకి ఎదురు నిలిచి, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే తమకు అభ్యంతరం లేదని అన్నారు. చంద్రబాబు, ఆయన బినామీలతో కలిసి పవన్‌ కళ్యాణ్ తమపై దాడి చేస్తే సహించేది లేదని చెప్పుకొచ్చారు.

చాలా రోజుల తర్వాత చంద్రబాబు గురించి కొడాలి నాని ఏం అన్నారంటే..

చంద్రబాబు, లోకేష్ గురించి ఒక్క రేంజ్ లో ఫైర్ అయ్యే కొడాలి నాని.. మరోసారి తనదైన స్టైల్ లో విమర్శలు చేసారు. సాగునీటి ప్రాజెక్టుల యాత్ర చేస్తున్న చంద్రబాబుపై మండిపడ్డారు కొడాలి నాని. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన హయాంలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో ప్రకటించాలన్నారు. ప్రాజెక్టుల పరిశీలన పేరుతో చంద్రబాబు విచిత్ర విన్యాసాలు చేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. మొత్తం 20ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం పార్టీ పోలవరం ప్రాజెక్టుకు వంద కోట్ల పనులు కూడా ఎందుకు చేయలేకపోయిందని ఆరోపించారు. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును తన పబ్లిసిటీ కోసం చంద్రబాబు తీసుకున్నారంటూ విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..