‘ప్రభుత్వ ఉద్యోగాల కల్పనపై చర్చకు సిద్దమా’.. చంద్రబాబుకు పోతిన మహేష్ సవాల్..

రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మకు సొంత ఇల్లు ఉండాలని తపించిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు పోతిన మహేష్. వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గానీ కూటమిలోని నేతలు ఇలాంటి హామీలను ఇస్తున్నారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ చేసే మంచిపై కనీసం ఎక్కడైనా మాట్లాడుతున్నారా అని నిలదీశారు.

'ప్రభుత్వ ఉద్యోగాల కల్పనపై చర్చకు సిద్దమా'.. చంద్రబాబుకు పోతిన మహేష్ సవాల్..
Potina Mahesh
Follow us
Srikar T

|

Updated on: Apr 29, 2024 | 4:48 PM

రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మకు సొంత ఇల్లు ఉండాలని తపించిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు పోతిన మహేష్. వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గానీ కూటమిలోని నేతలు ఇలాంటి హామీలను ఇస్తున్నారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ చేసే మంచిపై కనీసం ఎక్కడైనా మాట్లాడుతున్నారా అని నిలదీశారు. కూటమి ప్రచారంలో ఒకరి భజన ఒకరు చేసుకోవడం తప్ప ప్రజలకు ఫలానా హామీలు ఇచ్చి అమలు చేస్తామని చెప్పడం లేదన్నారు. ప్రజలకు మేలు చేస్తామని, పథకాలు కొనసాగిస్తామని ఎక్కడా మాట్లాడటం లేదని ఆరోపించారు. ఎంతసేపటికీ సీఎం జగన్ పై అక్కస్సు వెళ్లగక్కడం, ఈ ప్రభుత్వాన్ని దించేస్తామని విమర్శించడం తప్ప మంచి చేస్తామని ప్రచారం చేయడం లేదని విమర్శించారు. ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరమా అంటూ మండిపడ్డారు.

పేద ప్రజలను గొప్ప స్థాయికి తీసుకెళ్లాలనే గొప్ప సంకల్పంతో సీఎం జగన్ పనిచేస్తుంటే.. కూటమి నేతలు ఓర్వలేక బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని.. కానీ సచివాలయ వ్యవస్థతో పాటు ఇతర శాఖల్లో దాదాపు 2లక్షలకుపైగా ఉద్యోగాలను నిరుద్యోగులకు కల్పించారని చెప్పారు. కూటమి నేతలతో నిరుద్యోగంపై చర్చించేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్దంగా ఉన్నామని, దీనికి చంద్రబాబు ఆయన కూటమి సిద్దమా అని సవాల్ విసిరారు. సీఎం జగన్ మేనిఫోస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తుంటే.. చంద్రబాబు తన అధికారిక వెబ్ సైట్ నుంచే 2014 మేనిఫెస్టోను తొలగించారని చురకలు అంటించారు. ఇలాంటి పరిస్థితి దేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదన్నారు.

లైవ్ వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే