‘జగన్ అనే నేను’.. మళ్లీ అధికారమే లక్ష్యంగా వైసీపీ అడుగులు.. సరికొత్త ప్రచారాస్త్రాలతో జనంలోకి.!
ఏపీలో ఎన్నికల కోసం వైసీపీ కౌంట్ డౌన్ సిద్ధం చేస్తోంది. ఎవరు ఎలా వచ్చినా, ఎప్పుడు వచ్చినా, తాము సిద్ధం అంటున్న వైసీపీ వినూత్న రీతిలో ప్రచారానికి మరోసారి తెరలేపింధి.
ఏపీలో ఎన్నికల కోసం వైసీపీ కౌంట్ డౌన్ సిద్ధం చేస్తోంది. ఎవరు ఎలా వచ్చినా, ఎప్పుడు వచ్చినా, తాము సిద్ధం అంటున్న వైసీపీ వినూత్న రీతిలో ప్రచారానికి మరోసారి తెరలేపింధి. వైసీపీ కేంద్ర కార్యాలయంలో టైంతో కూడిన డిస్‌ప్లే బోర్డును ఏర్పాటు చేసింది. 2019 ఎన్నికల ముందు ‘bye bye’ బాబు అంటూ నినాదాన్ని బలంగా తీసుకొని వెళ్లేందుకు లైవ్ టైమ్ డిస్ ప్లే బోర్డును ఏర్పాటు చేసిన వైసీపీ.. ఇప్పుడు పొత్తులతో వస్తున్న మూడు పార్టీలను ఎదుర్కోవడానికి 2024 ఎన్నికల్లో మరోసారి సిద్ధం అంటూనే ‘జగన్ అనే నేను’ సిద్ధం అంటూ డిస్ ప్లే బోర్డు ఏర్పాటు చేసి అందులో డేట్, టైమ్, రోజులతో సహా లైవ్‌లో కనిపించేలా ఏర్పాటు చేసింది. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మరోసారి అధికారంలోకి వస్తామని బలంగా చెబుతోంది వైసీపీ. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్తోంది. ఇక ఇప్పటికే ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాము దేనికైనా సిద్ధమేనంటూ.. సంకేతాలను విపక్షాలకు పంపుతోంది. సిద్ధం సభలు సక్సెస్ కావడంతో, ఎన్నికల క్యాంపెయిన్ కోసం సరికొత్త కార్యక్రమాలను సిద్ధం చేస్తోంది. ‘నా కల’ పేరుతో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా అడుగులు వేస్తున్న వైసీపీ అధినేత జగన్ త్వరలో ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే ఏపీలో తమకు కలిసి వచ్చే అన్ని మార్గాలపై దృష్టి సారించారు.
ఏపీలో ఎన్నికల ప్రచారం రోజురోజుకీ జోరందుకుంటోంది. ప్రత్యర్ధులపై పైచేయి సాధించేందుకు పార్టీలు, అభ్యర్ధులు వినూత్న రీతిలో ప్రచారం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే ‘నిన్ను నమ్మం బాబు, gud bye బాబు’ పేరుతో ఉధృతంగా ప్రచారం సాగిస్తున్న వైసీపీ.. తాజాగా మరో కొత్త తరహా ప్రచారానికి తెరదీసింది. ఏపీలో ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీలను ఎలాగైనా ఢీ కొట్టాలని వ్యూహాలు రచిస్తున్న వైసీపీ.. 2019 ఎన్నికల్లో ‘బైబై బాబు- రావాలి జగన్- కావాలి జగన్’ పేరుతో చంద్రబాబు ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లుగా సూచించేలా డిజిటల్ క్లాక్స్‌ను ఏర్పాటు చేయగా.. మళ్ళీ అదే ఫార్ములాను రిపీట్ చేస్తూ డిజిటల్ క్లాక్ కౌంట్ డౌన్ ఐడియాకు రూపకల్పన చేసింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఇలాంటి కౌంట్ డౌన్ క్లాక్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థులను ఎదుర్కొంటూ వెళ్తామని వైసీపీ అంటోంది. అందులో భాగంగానే తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలోని వచ్చే మూడు లేదా నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని వైసీపీ కార్యాలయాల్లోనూ ఈ తరహా కౌంట్ డౌన్ క్లాక్స్‌ను ఏర్పాటు చేయాలని వైసీపీ కేంద్ర కార్యాలయం సూచించింది. తద్వారా పార్టీ క్యాడర్‌తో పాటు ఓటర్లలోనూ జోష్ నింపాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడే కొద్దీ ఇదే తరహాలో మరిన్ని ప్రచార వ్యూహాలు అమలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆయా ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగానే కార్యాచరణ సిద్ధం చేస్తుంది.