AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: పొత్తుల ప్రకటన తర్వాత బీజేపీపై ఎదురు దాడికి సిద్ధం అవుతున్న వైసీపీ

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఎన్నికల రణరంగంలో అధికార వైసీపీని ఢీకొట్టేందుకు ఏకమైన వేళ వైయస్ జగన్ తాడోపేడో తేల్చుకుంటామంటూ స్పష్టం చేస్తున్నారు.అదే దిశగా వైఎస్ జగన్ పార్టీ నేతలను కార్యకర్తలను సిద్ధం చేస్తూనే ప్రత్యర్థి పార్టీల విమర్శలకు గట్టి కౌంటర్లు సిద్ధం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం జనసేన పార్టీలు..

AP Politics: పొత్తుల ప్రకటన తర్వాత బీజేపీపై ఎదురు దాడికి సిద్ధం అవుతున్న వైసీపీ
Ap Politics
S Haseena
| Edited By: |

Updated on: Mar 13, 2024 | 9:36 PM

Share

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఎన్నికల రణరంగంలో అధికార వైసీపీని ఢీకొట్టేందుకు ఏకమైన వేళ వైయస్ జగన్ తాడోపేడో తేల్చుకుంటామంటూ స్పష్టం చేస్తున్నారు.అదే దిశగా వైఎస్ జగన్ పార్టీ నేతలను కార్యకర్తలను సిద్ధం చేస్తూనే ప్రత్యర్థి పార్టీల విమర్శలకు గట్టి కౌంటర్లు సిద్ధం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం జనసేన పార్టీలు మాత్రమే తమ రాజకీయ ప్రత్యర్థులుగా భావించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా రెండు పార్టీల పంచిన బీజేపీ చేరడంతో ఇక బీజేపీ విషయంలోనూ వెనక్కు తగ్గకూడదని నిర్ణయానికి వచ్చారు ఏపీలో నెలకొన్న రాజకీయ సమీకరణాల నడుమున తమకు ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న వారి విషయంలో ఉపేక్షించాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ భావిస్తున్నారు.అందులో భాగంగానే టీడీపీ జనసేన పార్టీలతో పాటు బీజేపీ పైన ఇక గురిపెట్టి చివరి సిద్ధం సభలో సైతం బీజేపీ పై విమర్శనాస్త్రాలు సంధించారు.

ఇక ఎన్నికల ప్రచారంలో ఇక బీజేపీని టార్గెట్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ నేతలు ఇటీవల కాలంలో ప్రభుత్వ నిర్మాణ పరమైన అంశాలపై కాకుండా వ్యక్తిగతంగా టార్గె్‌ట్‌గా చేసిన పరిస్థితులపై మొదటి నుంచి బీజేపీ పై గుర్రుగా ఉన్న వైసీపీ తాజాగా పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలిచిన నేపథ్యంలో బీజేపీ టార్గె్‌ట్‌గా అడుగులు వేస్తోంది వైసీపీ. ఎన్నికల కురుక్షేత్రంలో 2014లో తన ఓటమికి కారణం మూడు పార్టీలేనని బలంగా విశ్వసిస్తున్న వైఎస్ జగన్.. ఇప్పుడు ముగ్గురు కలిసి వచ్చిన తమకు ఎదురు లేదని చెబుతూనే ఏపీ బీజేపీని తూర్పార పట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పొత్తుల కోసం జాతీయ అధినాయకత్వం కంటే రాష్ట్ర అధినాయకత్వం పట్టుబట్టి ఏపీలో ఎన్నికల తీర్మానాలు చేసి పొత్తుల కోసం పట్టు పట్టారని భావిస్తున్న వైసీపీ.. బీజేపీని ఉపేక్షించాల్సిన అవసరం లేదని భావిస్తోంది.

ఎన్నికల ప్రచారంలో మూడు పార్టీలను ఎదుర్కోవడానికి వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే తెలుగుదేశం జనసేన పార్టీల రాజకీయ విమర్శలకు వైసీపీ గట్టి కౌంటర్ సిద్ధం చేసుకుంటుంది. 2014 తర్వాత ఉమ్మడిగా అధికారాన్ని చేపట్టిన జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వాల వైఖరిని తూర్పారబట్టాలని వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర విభజన హామీలు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర రెవెన్యూ లోటు, ఉమ్మడిగా ఆస్తుల విభజనకు సంబంధించిన అంశాల విషయంలో ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు కార్యకరణ సిద్ధం చేసుకుంటుంది వైసీపీ. అలాగే 2014 తర్వాత 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం జనసేన పార్టీలు బీజేపీతో విడిపోయి ఆ పార్టీపై విమర్శలు చేసిన అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తోంది. అప్పటి బీజేపీ అధినాయకత్వం విషయంలో చంద్రబాబు అనుసరించిన వైఖరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై చేసిన విమర్శలు చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ని ఇద్దరు బీజేపీ విషయంలో అనుసరించిన తీరు లాంటి అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా నేతలకు దిశా నిర్దేశం చేస్తుంది వైసీపీ. పైగా 2019 ఎన్నికలకు 2024 ఎన్నికలకు మధ్య ఉన్న తేడా చూడాలి అంటూ ప్రచారాన్ని ప్రారంభించబోతోంది.

వాటితో పాటు ఇటీవల ఏపీలో ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ లోని ఒక వర్గం నేతలు అధికార వైసీపీ అయిన టార్గెట్ చేశారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ అధినాయకత్వంతో సంబంధం లేకుండానే వలస నేతల బీజేపీలో నుంచి టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఈ విషయంలో బీజేపీని కార్నర్ చేసేలాగా వైసిపి అడుగులు వేస్తోంది .గతంలో అమిత్ షా,నడ్ద పర్యటనలు ప్రభుత్వం తీరుపై చేసిన విమర్శలు ఇటీవల బీజేపీ అగ్ర నేతలు రాష్ట్రంలో పర్యటించినప్పుడు ప్రభుత్వంపై విమర్శిస్తున్న తీరుని గుర్తు చేస్తూనే ఏపీలో బీజేపీలో కంటే తెలుగుదేశం వలస నేతలే బీజేపీని ఎలుతున్నారని . ఈ విషయంలో బీజేపీ ని ఉపేక్షించాల్సిన అవసరం లేదని అంటుంది వైసీపీ.

మరోవైపు ఎన్నికల ప్రచారం ప్రారంభం కాగానే ఎపిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన జరిగిన వెంటనే తమ కార్యచరణ అమల్లో పెట్టేందుకు వైసిపి సిద్ధమవుతోంది. ప్రధాని తన పర్యటనలో ఏం మాట్లాడతారు 2014-19 -24 ఎన్నికలకు సంబంధించిన అంశంలో ఆయన ప్రకటన ఎలా ఉండబోతోంది. అధికార వైసీపీని విమర్శిస్తారా లేక పొత్తులపై ఎలా స్పందిస్తారు అనేది చూసిన తర్వాత మూడు పార్టీలను తూర్పు పడబట్టేలా వైసీపీ అడుగులు వేస్తోంది. వైసిపి బీజేపీ పొత్తు పెట్టుకున్న తమకు వచ్చిన నష్టం లేదని ఓటు షేరింగ్ విషయంలో పెద్దగా సమస్య రాదని కానీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నా అంశాన్ని మాత్రం సీరియస్గానే పరిగణిస్తుంది వైసీపీ.ఎపిలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా బీజేపీ అయిన టీడీపీ , జన సేన అయినా అన్ని పార్టీలను రాజకీయంగా సమధురంగానే చూస్తామని పొత్తుల్తో ఏకమై అన్ని పార్టీలు కలిసి వస్తున్న వేళ బీజేపీని టార్గెట్ చేస్తామని వైసీపీ అంటుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి