AP Politics: మానవ తప్పిదాలు సహజమే.. రిషికొండపై వైసీపీ-టీడీపీ మధ్య ట్విట్టర్ వార్..

జాగ్‌లో పొలిటికల్ హీట్ పెంచిన రిషికొండ నిర్మాణాలపై వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. రిషికొండపై జరుగుతున్న నిర్మాణాలు రాష్ట్ర సచివాలయం కోసమే అనే మీనింగ్ వచ్చేట్లు వైసీపీ సోషల్ మీడియా ఓ ట్వీట్ చేసింది. దాన్ని విపక్ష తెలుగు దేశం పార్టీ అదే ట్విట్టర్ వేదికగా కామెంట్ చేయడంతో అధికార పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు.

AP Politics: మానవ తప్పిదాలు సహజమే.. రిషికొండపై వైసీపీ-టీడీపీ మధ్య ట్విట్టర్ వార్..
YCP and TDP on Rishikonda
Follow us
Sanjay Kasula

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 13, 2023 | 6:27 PM

విశాఖపట్నం, ఆగస్టు 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ చేసిన ఓ ట్వీట్ రాజకీయంగా కలకలం రేపింది. వైజాగ్‌లో పొలిటికల్ హీట్ పెంచిన రిషికొండ నిర్మాణాలపై వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. రిషికొండపై జరుగుతున్న నిర్మాణాలు రాష్ట్ర సచివాలయం కోసమే అనే మీనింగ్ వచ్చేట్లు వైసీపీ సోషల్ మీడియా ఓ ట్వీట్ చేసింది. దాన్ని విపక్ష తెలుగు దేశం పార్టీ అదే ట్విట్టర్ వేదికగా కామెంట్ చేయడంతో అధికార పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు.

జరుగుతున్న నిర్మాణాలు సచివాలయానివంటూ చేసిన ట్వీట్ ఓ పొరపాటుని, మానవ తప్పిదాలు సహజమని వైసీపీ సోషల్ మీడియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ల వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఓ ట్వీట్ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధానికి కారణంగా మారింది.

రిషికొండపై ట్విట్టర్ వార్..

రిషికొండపై రాష్ట్ర సచివాలయం అంటూ ఏపీ అధికార పార్టీ వైసీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీ అధికారిక ట్విట్టర్ హాండిల్‌లో ఈ పోస్టు పెట్టింది. రాష్ట్ర సచివాలయం కోసమే అక్కడ బిల్డింగ్స్ నిర్మిస్తున్నట్లు పార్టీ అధికారిక ట్విటర్‌ ఖాతా నుంచి పోస్టు పెట్టింది. ఇది కాస్తా పెద్ద చర్చకు కారణంగా మారింది. అయితే ఆ ట్వీట్ ఓ పొరపాటని వైసీపీ వివరణ ఇచ్చుకుంది. “మా అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రిషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న(శనివారం) చేసిన ట్వీట్‌లో పొరపాటున చేయడం జరిగింది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణలోకి తీసుకోగలరు.” అంటూ పొరపాటును సవరించుకునే ప్రయత్నం చేసింది వైసీపీ.

దీనిపై వెంటనే తెలంగు దేశం పార్టీ స్పందించింది. రిషికొండపై పర్యాటక ప్రాజెక్టు నిర్మిస్తున్నామని.. అక్కడ జరుగుతున్న నిర్మాణాలు ప్రభుత్వ కార్యాలయాల కోసం కాదంటూ ప్రభుత్వం ఇంతకాలం బుకాయిస్తూ వచ్చిందంటూ ప్రతిపక్షపార్టీ తెలుగు దేశం పార్టీ రీ ట్వీట్ చేసింది. అవన్నీ అబద్ధాలేనని తాజా ట్వీట్‌తో తేలిపోయిందంటూ అందులో పేర్కొంది. ఈ ట్వీట్ ఎందుకు డెలీట్ చేసావ్ ‘బుజ్జి కన్నా’ ? భయం వేసిందా ? సిగ్గేసిందా ? అంటూ ఓ ట్వీట్ చేయడంతో వెంటనే వైసీపీ రియాక్ట్ అయ్యింది. మానవ తప్పిదాలు అనేవి సహజంగానే జరుగుతుంటాయి.

అలాగే ఇది కూడా జరిగింది. దానిపై ప్రజలకు తిరిగి వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఒక తప్పిదం జరిగితే అది జరిగింది అని ఒప్పుకుని, దానిని ప్రజలకు వివరించి చెప్పే దమ్ము దైర్యం మాకు ఉంది. కానీ మీలాగా మీ నాయకుడిలా.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా ప్రజలను మభ్యపెట్టే తప్పుడు కార్యక్రమాలు మేమెప్పుడు చేయలేదు, చేయబోము కూడా. ఇదీ మా నాయకుడు జగన్‌ మాకు నేర్పిన లక్షణం, ఇదీ మా విశ్వసనీయత అంటూ మరో ట్వీట్ చేసింది. అంతటితో ఆకుండా మరో 30 నిమిషాల్లో మరింత సెటైర్ ట్వీట్ చేసింది వైసీపీ.

విశాఖ నుంచే పాలన – మంత్రి అమర్‌నాథ్

సీఎం విశాఖ పాలనపై మరోసారి కీలక కామెంట్స్ చేశారు మంత్రి అమర్‌నాథ్. విశాఖ నుంచే సీఎం జగన్‌ పరిపాలన చేస్తారని అమర్‌నాథ్ తేల్చి చెప్పారు. సీఎం విశాఖ రావడానికి ఏ బిల్లు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఎవ్వరి సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా పాలన చేయోచ్చని..  పలానా ప్రాంతం నుంచే పాలన చెయ్యాలని రాజ్యాంగంలో లేదన్నారు మంత్రి అమర్‌నాథ్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!