YS Jagan: తగ్గేదేలే.. మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధం.. 15 రోజులు నాన్‌స్టాప్ ప్రచారం..

|

Apr 25, 2024 | 3:30 PM

వై నాట్ 175 అసెంబ్లీ.. 25 ఎంపీ సీట్స్.. టార్గెట్‌గా వైఎస్ఆర్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్రతో వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన యాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది.

YS Jagan: తగ్గేదేలే.. మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధం.. 15 రోజులు నాన్‌స్టాప్ ప్రచారం..
Ys Jagan
Follow us on

వై నాట్ 175 అసెంబ్లీ.. 25 ఎంపీ సీట్స్.. టార్గెట్‌గా వైఎస్ఆర్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్రతో వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన యాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. మొత్తం 2100 కిలోమీటర్ల మేర బస్సుయాత్ర సాగింది. 86 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్‌.. ఇప్పటివరకు 16 బహిరంగసభలు, 6 ప్రత్యేక సమావేశాలు, 9చోట్ల భారీ రోడ్‌షోలలో పాల్గొన్నారు. నిన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగియగా.. ఇవాళ.. పులివెందుల వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

ఒకవైపు సంక్షేమ పథకాలు, అభివృద్ధి.. మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వంతో ప్రజా ప్రతినిధుల్ని ప్రజలతో మమేకం చేసిన ముఖ్యమంత్రి జగన్‌ మరో జైత్రయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం పేరుతో చేసిన యాత్రలతో ప్రజా మద్దతు వైసీపీకే ఉందని నిరూపించారు. రెండు రోజుల్లో మరో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు.

ఈ నెల 27 లేదా.. 28వ తేదీ నుంచి సీఎం జగన్‌ ఎన్నికల సభల్లో పాల్గొనేలా వైసీపీ కార్యాచరణ రూపొందిస్తోంది. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో.. 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్‌ మ్యాప్‌కు వైసీపీ ముఖ్యనేతలు తుది మెరుగులు దిద్దుతున్నారు.

ప్రతిరోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. సభల్లో తన పాలనలో జరిగిన అభివృద్ధిని, కుల, మత, వర్గ, జాతి, రాజకీయ బేధాల్లేకుండా అందించిన సంక్షేమ లబ్ధిని వివరిస్తూనే.. మరోవైపు ప్రతిపక్ష కూటమి కుట్రలను ఎండగట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి..

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..