YS sharmila: బుధవారమే ఢిల్లీకి వైఎస్‌ షర్మిల.. కాంగ్రెస్‌లో చేరడంపై ఏఐసీసీ అగ్ర నాయ‌కులతో భేటీ

|

Jan 02, 2024 | 7:49 PM

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక ఖాయమైంది. గురువారం (జనవరి 4) కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం కాబోతోంది. ఇందుకోసం బుధవారం (డిసెంబర్‌ 3) సాయంత్రమే ఢిల్లీ వెళ్లనున్న షర్మిల.. అక్కడ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నారు. ఇదే విషయాన్ని లోటస్ పాండ్‌లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో షర్మిల స్పష్టం చేశారు

YS sharmila: బుధవారమే ఢిల్లీకి వైఎస్‌ షర్మిల.. కాంగ్రెస్‌లో చేరడంపై ఏఐసీసీ అగ్ర నాయ‌కులతో భేటీ
YS Sharmila
Follow us on

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక ఖాయమైంది. గురువారం (జనవరి 4) కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం కాబోతోంది. ఇందుకోసం బుధవారం (డిసెంబర్‌ 3) సాయంత్రమే ఢిల్లీ వెళ్లనున్న షర్మిల.. అక్కడ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నారు. ఇదే విషయాన్ని లోటస్ పాండ్‌లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ తనకు పలు పదవులను ఆఫర్ చేశారని షర్మిల నేతలకు వివరించారు. ఇక రాజన్న కూతురికి రాజ్యసభ సీటు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పోస్టును కాంగ్రెస్ హైకమాండ్ ఆఫర్ చేసినట్టు వైఎస్‌ఆర్‌టీపీ నేతలు తెలిపారు. ఏపీ పీసీసీ చీఫ్ పదవిని కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఆఫర్ చేసిందని.. అయితే దీనిపై షర్మిల ఇంకా ఆలోచిస్తున్నారని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో షర్మిల స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించే అవకాశం ఉందని వైఎస్‌ఆర్‌టీపీ నేత రాంరెడ్డి చెప్పారు.  మొత్తానికి కాంగ్రెస్‌లోకి షర్మిల ఎంట్రీ ఖాయం కావడంతో.. ఆమెకు హస్తం పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుంది ? ఆమె సేవలను కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో వినియోగించుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.

షర్మిల నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఆమె కాంగ్రెస్‌లో చేరడం.. రాష్ట్రశాఖ పగ్గాలు చేపట్టడం.. రాజకీయంగా ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే చర్చ జరుగుతోందిప్పుడు. అయితే, ఎవరు ఏ పార్టీలో చేరినా.. ఎంత మంది కలిసొచ్చినా… మళ్లీ గెలిచేది తమ పార్టీయే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. తాజాగా ఇదే విషయంపై స్పందించారు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి.షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తమకు ఎలాంటి సమాచారం లేదన్నారాయన.  ఎవరు ఏ పార్టీలో చేరినా.. ఏపీలో తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..