Vanjangi: వంజంగి మేఘాల కొండకు పర్యాటకులకు న్యూ ఇయర్ వేళ నో ఎంట్రీ.!
శీతాకాలం.. వంజంగి మేఘాల కొండ సోయగం అంతా ఇంతాకాదు.. దేవ లోకం భువికి దిగొచ్చిందా అన్నట్టుగా మంచు మేఘాలు కనువిందు చేస్తాయి. పాల నురుగులాంటి మంచు మేఘాల మధ్య విహరిస్తూ ఆనందిస్తారు పర్యాటకులు. ఇక న్యూ ఇయర్ వచ్చిందంటే..వంజంగి లో సెలబ్రేషన్స్ మాములుగా ఉండవు. ఈసారి కూడా చాలా మంది అల్లూరిజిల్లాలోని వంజంగి టూర్‌కు ప్లాన్ చేసే ఉంటారు. అలాంటివారికి ఈ వార్త కాస్త నిరాశ కలిగిస్తుందనే చెప్పాలి.
శీతాకాలం.. వంజంగి మేఘాల కొండ సోయగం అంతా ఇంతాకాదు.. దేవ లోకం భువికి దిగొచ్చిందా అన్నట్టుగా మంచు మేఘాలు కనువిందు చేస్తాయి. పాల నురుగులాంటి మంచు మేఘాల మధ్య విహరిస్తూ ఆనందిస్తారు పర్యాటకులు. ఇక న్యూ ఇయర్ వచ్చిందంటే.. వంజంగి లో సెలబ్రేషన్స్ మాములుగా ఉండవు.. ఈసారి కూడా చాలా మంది అల్లూరిజిల్లాలోని వంజంగి టూర్‌కు ప్లాన్ చేసే ఉంటారు. అలాంటివారికి ఈ వార్త కాస్త నిరాశ కలిగిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే జనవరి 2 నుంచి 9వ తేది వరకు వంజంగి కి పర్యాటకులను అనుమతించరు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు కూడా . పర్యాటకుల క్షేమం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వద్దన్నా వినకుండా ప్లాస్టిక్ బాటిల్స్..కవర్స్‌ను వాడటం.. మన ఇల్లు కాదుకదా అన్నట్టు ఎక్కడపడితే అక్క పడేయడం పరిపాటయింది. ఫలితంగా వంజంగి లో ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం సహా వంజంగి లో రోడ్ల మరమ్మతుల కోసం ఓ వారం వంజంగి లో పర్యాటకులకు చిన్న బ్రేక్ ఇచ్చారు. తిరిగి జనవరి 9 నుంచి యథావిధిగా పర్యాటకులు వంజంగి కొండకు రావచ్చు.. మేఘాల్లో తేలిపోవచ్చు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తుంచుకొని సహకరించాలని కోరారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.