Srisailam – Tirumala: నిన్న తిరుమల.. ఇవాళ శ్రీశైలం.. చిరుతలు మళ్లీ ప్రత్యక్షం.!
ధనుర్మాసంలో పుణ్యక్షేత్రాలకు భక్తుల రద్దీ పెరిగింది. కానీ ఇదే సమయంలో క్రూర మృగాలు మళ్లీ జనజీవనంలోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మొన్నటి వరకూ తిరుమల మొదలు యాగంటి వరకూ పలు పుణ్య క్షేత్రాల్లో చిరుతలు, ఎలుగుబంట్లు సంచరిస్తూ, భక్తులపై దాడులకు పాల్పడుతూ తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. అధికారులు చర్యలు చేపట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ మళ్లీ ఇప్పుడు సీన్ మొదటకి వచ్చినట్టే ఉంది. శనివారం తిరుమలలో అలిపిరి నడకమార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఎలుగుబంటి కూడా సంచరించినట్టు అధికారులు తెలిపారు.
ధనుర్మాసంలో పుణ్యక్షేత్రాలకు భక్తుల రద్దీ పెరిగింది. కానీ ఇదే సమయంలో క్రూర మృగాలు మళ్లీ జనజీవనంలోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మొన్నటి వరకూ తిరుమల మొదలు యాగంటి వరకూ పలు పుణ్య క్షేత్రాల్లో చిరుతలు, ఎలుగుబంట్లు సంచరిస్తూ, భక్తులపై దాడులకు పాల్పడుతూ తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. అధికారులు చర్యలు చేపట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ మళ్లీ ఇప్పుడు సీన్ మొదటకి వచ్చినట్టే ఉంది. శనివారం తిరుమలలో అలిపిరి నడకమార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఎలుగుబంటి కూడా సంచరించినట్టు అధికారులు తెలిపారు. తాజాగా శ్రీశైలంలో చిరుత ప్రత్యక్షమైంది. రత్నానందస్వామి ఆశ్రమం గోడపై చిరుత ప్రత్యక్షమైంది. నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుతపులి మరోసారి కలకలం రేపింది. రత్నానందస్వామి ఆశ్రమం వద్ద రాత్రి చిరుతపులి సంచరించింది. రాత్రి సమయంలో ఆశ్రమం హోమగుండం వద్ద ఉన్న గోడపై చిరుతపులిని గుర్తించిన భక్తులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సుమారు గంటపాటు హోమగుండం వద్ద పడుకుని అటూ ఇటూ తిరగడంతో భక్తులు, స్థానికులు భయపడ్డారు. కానీ అది ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టలేదు. కొద్ది సమయం తర్వాత వాహనాల రద్దీ పెరగడంతో చిరుతపులి అడవిలోకి వెళ్లిపోయింది యాత్రికులు చిరుతపులిని సెల్ ఫోన్ లలో షూట్ చేశారు. చిరుతపులి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

