YS Jagan: జగన్‌ తిరుమల పర్యటన రద్దు.. మీడియా ముందుకు..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి మాట్లాడనున్నారు. అయితే తిరుమల రద్దుకు గల కారణాలను మీడియా ముందు వెళ్లడించనున్నారు. ఇప్పటికే డిక్లరేషన్‌పై రాజకీయ దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. అయితే..

YS Jagan: జగన్‌ తిరుమల పర్యటన రద్దు.. మీడియా ముందుకు..
Ys Jagan

Updated on: Sep 27, 2024 | 3:44 PM

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి మాట్లాడనున్నారు. అయితే తిరుమల రద్దుకు గల కారణాలను మీడియా ముందు వెళ్లడించనున్నారు. ఇప్పటికే డిక్లరేషన్‌పై రాజకీయ దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. అయితే డిక్లరేషన్‌ చేయాల్సిందే అంటూ బీజేపీ, హిందూ సంఘాలు డిమాండ్‌ చేశాయి.

ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌పై దాడికి కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే రౌడీలను తిరుపతిలో ఉంచినట్టు సమాచారం ఉందని, ప్రజల్లో కలిసే సమయంలో దాడి చేయాలని కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ కేడర్‌ లేకుండా ఒంటరిగా చేసి దాడి చేసే కుట్ర జరుగుతోందని, ఈ ప్రభుత్వం ఇప్పటికే 40 రాజకీయ హత్యలకు కారణమైందని అన్నారు. దీనిపై పోలీసులు వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని భూమన డిమాండ్‌ చేశారు.

ఇది కూడా చదవండి: Sunday Holiday: ఆదివారమే సెలవు ఎందుకు? ఇది ఎలా వచ్చింది? ఆసక్తికర విషయాలు

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు జగన్‌ పర్యటనపై స్పందించారు. ఆచారాలు పాటించాలని కొద్ది నిమిషాల ముందు సీఎం ట్వీట్‌ చేశారు. ఆలయ నియమాలు, నిబంధనలు తప్పక పాటించాలన్నారు. భక్తుల మనోభావాలు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించొద్దని సూచించారు. తిరుమల పవిత్రతను కాపాడుతామని.. దీనికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

తిరుమల పర్యటన రద్దుపై మీడియా ముందు వెళ్లడించిన వైఎస్‌ జగన్‌

ఇది కూడా చదవండి: 2025 Holidays: వచ్చే ఏడాది సెలవుల జాబితా ఇదే.. ఆ నెలలో ఎక్కువ హాలిడేస్‌

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి