BSNL: వావ్‌.. ఏ ప్లాన్‌రా బాబు.. చౌకైన రీఛార్జ్‌తో 52 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!

జూలై నెల నుండి జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాల రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు దాదాపు 25 శాతం పెరిగిన తర్వాత, ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌ల కోసం వెతుకుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 1 GB రోజువారీ డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం. జియోతో పోలిస్తే ఈ ప్లాన్‌లు సగం ధరకే వస్తాయి..

BSNL: వావ్‌.. ఏ ప్లాన్‌రా బాబు.. చౌకైన రీఛార్జ్‌తో 52 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 25, 2024 | 7:23 PM

జూలై నెల నుండి జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాల రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు దాదాపు 25 శాతం పెరిగిన తర్వాత, ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌ల కోసం వెతుకుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 1 GB రోజువారీ డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం. జియోతో పోలిస్తే ఈ ప్లాన్‌లు సగం ధరకే వస్తాయి. అదే సమయంలో ప్రయోజనాల గురించి మాట్లాడినట్లయితే, బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌లు జియో మాదిరిగానే చెల్లుబాటు, కాల్‌లను అందిస్తాయి.

ఇక్కడ మనం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 52 రోజుల చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ తన వినియోగదారులకు రూ.298 రీఛార్జ్ ప్లాన్‌తో కాలింగ్, డేటా ప్రయోజనాలను అందిస్తుంది.

ఇది కూడా చదవండి: Airtel: ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు పెద్ద అప్‌డేట్.. కొత్త సర్వీస్‌ ఈ రాత్రి నుంచే ప్రారంభం!

ఇవి కూడా చదవండి

వాలిడిటీ 52 రోజులు:

అపరిమిత కాలింగ్, అపరిమిత డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 52 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ప్యాక్ లోకల్, ఎస్టీడీలో అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. ఇందులో రోజుకు 1GB డేటాతో పాటు రోజుకు 100 SMSల సౌకర్యం ఉంది. ఈ ప్లాన్‌లో Eros Now వినోద సేవలకు ఉచిత సభ్యత్వం కూడా ఉంది. అపరిమిత డేటా, ఎక్కువ కాలం కాల్ చేయాలనుకునే వారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Mobile: పొరపాటున మొబైల్‌లో ఈ పని చేయకండి.. యమ డేంజర్.. జైలు శిక్ష తప్పదు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి