- Telugu News Photo Gallery Business photos Earn Lakhs Through Social Media, Best Business Nowadays, Details Here
Business Idea: ఎంజాయ్ చేస్తూ లక్షల్లో ఆదాయం.. ఇప్పుడిదే ట్రెండింగ్ యాపారం.. ఎలాగంటే
నచ్చిన రంగంలో ఉద్యోగం చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ అందరికీ అది సాధ్యం కాదు. నెలనెలా క్రెడిట్ అయ్యే జీతం చాలామందికి ఇష్టం లేకపోయినా.. ఆ వివరాలు ఇలా..
Updated on: Sep 25, 2024 | 7:22 PM

నచ్చిన రంగంలో ఉద్యోగం చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ అందరికీ అది సాధ్యం కాదు. నెలనెలా క్రెడిట్ అయ్యే జీతం చాలామందికి ఇష్టం లేకపోయినా.. ఆ ఉద్యోగం చేస్తూనే జీవితాన్ని అసంతృప్తిగా కొనసాగిస్తుంటారు.

వంశపారంపర్యంగా వస్తున్న వ్యాపారమని, ఆదాయం బాగుందని కొనదరు అలానే కొనసాగిస్తుంటే.. మరికొందరు మాత్రమే కాలక్షేపాన్నే ఆదాయమార్గంగా ఎంచుకుని లక్షలు సంపాదిస్తున్నారు. అదెలాగో తెల్సా

కొందరు వ్లాగ్స్ చేస్తూ, మరికొందరు వీడియో గేమ్స్ ఆడుతూ.. ఒకవైపు ఎంజాయ్ చేస్తూనే.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కాసులు కురిపిస్తున్నారు నేటి యువత.

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి యాప్స్‌తో కుర్రకారు మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. పాతిక, ముప్పై ఏళ్లు నిండకుండానే ఇప్పుడు చాలామంది యువత మంచి స్థాయికి చేరుకున్నారు.

మరి మనలోని ఇలాంటి టాలెంట్ ఉంటే.. దాన్ని సరైన రీతిలో బయటపడితే వారిలాగే ఫేమస్ కావచ్చు. ఇక ఫేమస్ అయితే.. సోషల్ మీడియా ఆ వ్యక్తిని ఎక్కదివరకు తీసుకెళ్తుందో మనం ఇటీవల చాలామంది చూసే ఉంటాం.




