AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: చివరిసారి నిన్ను చూడకలేపోతున్నా… క్షమించు అమ్మ..! ఓ కొడుకు కన్నీటి గాధ..

ఇది ఓ యువకుడు తన తల్లిని ఉద్దేశిస్తూ రాసిన చివరి లేఖ. ఎస్.. జీవితం కోసం కలలుగని.. చదివి.. ఆ చదువుతో ఉద్యోగం కోసం ప్రయత్నించి.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయానన్న బాధ భరించలేకపోయాడు ఆ యువకుడు. చివరకు.. తనువు చాలించాడు. ఆ వివరాలు ఇలా..

Vizag: చివరిసారి నిన్ను చూడకలేపోతున్నా... క్షమించు అమ్మ..! ఓ కొడుకు కన్నీటి గాధ..
Representative Image
Maqdood Husain Khaja
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 12, 2025 | 12:55 PM

Share

ద్వారకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కొర్లాం గ్రామానికి చెందిన సంపత్ కుమార్ ఎంబీఏ పూర్తి చేశాడు. తనకు చిన్నప్పుడు నుంచి పెంచి పెద్దవాడిని చేసి చదివించిన తన తల్లిదండ్రులకు ఇక బాగా చూసుకోవాలని అనుకున్నాడు. ఉద్యోగం సాధించాలనే ఆశయంతో కొన్నేళ్ల క్రితం విశాఖకు వచ్చాడు. నగరంలోని మధురానగర్ లో ఓ ఇంట్లో అద్దెకు నివాసముంటున్నాడు. ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోవడంతో.. సంపాదన లేక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. బాదను భరించుకోలేక లోలోన మదనపడ్డాడు. తన గదిలో ఉంటున్న స్నేహితులు వెళ్లిపోయాక ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు సంపత్ కుమార్.

స్నేహితుడు తిరిగి ఇంటికొచ్చి చూసేసరికి.. సంపత్ కుమార్ వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ద్వారకా పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. సూసైడ్ నోట్ ను కూడా గుర్తించారు. ఆనోట్ లో తన ఉద్యోగం కోసం విశాఖ వచ్చిన సందర్భం ఆ తర్వాత పడిన కష్టాలను రాసుకొచ్చాడు. దాంతోపాటు.. ‘నేను అనుకున్నది సాధించలేకపోయాను. బతకడానికి నగరానికి వచ్చి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చివరి సారి నిన్ను చూడకలేపోతున్నా. బాధతో వెళ్తున్నా క్షమించు అమ్మ’ అంటూ ఆ లేఖ లో రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అనుకున్నది సాధించలేకపోయాడని.. తల్లికి క్షమాపణలు చెప్పి క్షణికావేశంలో తనువు చాలించిన సంపత్ కుమార్.. జీవితాంతం ఆ తల్లిదండ్రులు బాధపడే కడుపు కోతను మిగిల్చాడు. జీవితంలో అనుకున్నది సాధించకపోతే చావు ఒకటే మార్గం కాదు.. కష్టనష్టాలకు ఓర్చి ముందుకు సాగడమే జీవితం. అన్న విషయాన్ని యువత గ్రహించాలి. ఏదైనా కష్టం వస్తే అనుకున్న వాళ్ళతో షేర్ చేసుకోవాలని సూచిస్తున్నారు సైకాలజీ నిపుణులు. అలా చేస్తే.. గుండె బరువు తగ్గడమే కాదు.. జీవిత ప్రయాణంలో ముందుకు సాగే మార్గం కూడా సుగమం అవుతుందని అంటున్నారు.