వేడెక్కుతున్న ఏపీ పాలిటిక్స్‌,.. తూటాల్లాంటి మాటలతో అధికార విపక్షాల మధ్య డైలాగ్‌ వార్‌

వైసీపీ మూడేళ్ల పాలనపై మాటల యుద్ధం పీక్‌కి చేరింది. వైసీపీ హయాంలో హత్యలు, అక్రమ కేసులు తప్ప మరేమీ లేవంటూ బుక్‌లెట్‌ను విడుదల చేసింది తెలుగుదేశం. సీఎం జగన్‌ రాష్ట్రానికి..

వేడెక్కుతున్న ఏపీ పాలిటిక్స్‌,.. తూటాల్లాంటి మాటలతో అధికార విపక్షాల మధ్య డైలాగ్‌ వార్‌
Ap
Jyothi Gadda

|

Jun 10, 2022 | 9:50 PM

వైసీపీ మూడేళ్ల పాలనపై మాటల యుద్ధం పీక్‌కి చేరింది. వైసీపీ హయాంలో హత్యలు, అక్రమ కేసులు తప్ప మరేమీ లేవంటూ బుక్‌లెట్‌ను విడుదల చేసింది తెలుగుదేశం. సీఎం జగన్‌ రాష్ట్రానికి పట్టిన అరిష్టమని తీవ్ర వ్యాఖ్యలే చేశారు చంద్రబాబు. టీడీపీ అధినేత ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని, అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని కౌంటర్లు ఇస్తోంది వైసీపీ. మరోవైపు టెన్త్‌ ఫలితాలపై చర్చకు సై అంది అధికార పార్టీ.

ఏపీలో మూడేళ్ల పాలనపై వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఈ మూడేళ్లు అరాచక పాలన అంటూ ఫొటో గ్యాలరీ పెట్టింది టీడీపీ. దీనిపై బుక్‌లెట్‌ను విడుదల చేశారు చంద్రబాబు. ఈ మూడేళ్లలో జరిగిన ఘటనలను వివరిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని వల్లకాడు చేశారని, పోలీసులు వైసీపీ రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు వ్యవసాయం గురించి మాట్లాడిన వెంటనే రుతుపవనాలు ఆగిపోయాయని, ఆయనే అరిష్టమని విమర్శించారు మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని, అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి జోగి రమేష్‌.

ఇవి కూడా చదవండి

మరోవైపు టెన్త్‌ ఫలితాలపై చర్చకు వస్తారా అంటూ లోకేష్‌ విసిరిన సవాల్‌కు సై అన్నారు విజయసాయిరెడ్డి. ప్రభుత్వాన్ని రద్దు చేసి రావాలని అచ్చెన్నాయడు చేసిన సవాల్‌కు రియాక్ట్‌ అయ్యారు విజయసాయిరెడ్డి. టీడీపీకి అంత దమ్ముంటే ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu