Gang war: సోషల్ మీడియా వార్.. కాస్తా రోడ్డు మీదకి.. 2 వర్గాల నడుమ భీకర ఫైట్..

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో గ్యాంగ్ వార్ కలకలం రేపుతుంది. సోషల్ మీడియా వివాదం కాస్తా రోడ్డు మీద రచ్చకు దారితీసింది. ఇరువర్గాలు నడిరోడ్డుపై కుమ్మేసుకోవటం చూసిన స్థానికులు హడలెత్తిపోయారు.

Gang war: సోషల్ మీడియా వార్.. కాస్తా రోడ్డు మీదకి.. 2 వర్గాల నడుమ భీకర ఫైట్..
Gang War
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 10, 2022 | 9:20 PM

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో గ్యాంగ్ వార్ కలకలం రేపుతుంది. సోషల్ మీడియా వివాదం కాస్తా రోడ్డు మీద రచ్చకు దారితీసింది. ఇరువర్గాలు నడిరోడ్డుపై కుమ్మేసుకోవటం చూసిన స్థానికులు హడలెత్తిపోయారు. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ స్థానికంగా తీవ్ర భయాందోళనకు దారితీసింది. కందికుంట వెంకటప్రసాద్, అత్తార్ చాంద్ బాషా వర్గీయుల మధ్య వార్ తారాస్థాయికి చేరింది. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో అత్తార్ వర్గానికి చెందిన శ్రీనివాసుల నాయుడిపై కందికుంట వర్గీయులు పిడి గుద్దులు కురిపించారు. కిడ్నాప్ చేసేందుకు యత్నించారని కదిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అత్తార్ వర్గీయులు.

నారా లోకేష్ చెప్పినట్లు 2+1 ఫార్ములాలో కందికుంటకు టికెట్ రాదంటూ శ్రీనివాసుల నాయుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో ఆగ్రహించిన కందికుంట వర్గీయులు దాడికి దిగారు. శ్రీనివాసుల నాయుడిపై చేసిన దాడి వీడియో వైరల్ గా మారింది.